టిఆర్ఎస్ కు షాక్… ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరుకు బ్రేక్

తెలంగాణలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టిఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం బలపర్చిన యూటిఎఫ్ అభ్యర్ధి నర్సిరెడ్డి ఓటమి విజయం సాధించారు. టిఆర్ఎస్ బలపర్చిన పీఆర్టీయూ అభ్యర్ధి పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. దీంతో టిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలినట్టయ్యింది. మొత్తం 18885 ఓట్లు పోలయ్యాయి.

అందులో నర్సిరెడ్డికి 8976 ఓట్లు వచ్చాయి. రవీందర్ కు 6279 ఓట్లు వచ్చాయి. గతంలో నర్సిరెడ్డి తెలంగాణ యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. నర్సిరెడ్డి విజయంతో టిఆర్ఎస్ జోరుకు బ్రేక్ పడిందని పలువురు చర్చించుకుంటున్నారు.