మీ పిల్లలు బాగా చదువుకోవాలా.. ఈ చిట్కాలు మాత్రం కచ్చితంగా పాటించల్సిందే!

మరికొన్ని రోజుల్లో పది, ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. పది, ఇంటర్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం పిల్లల్ని పెంచడం తల్లీదండ్రులకు సవాలుగా మారగా తల్లీదండ్రులు పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పిల్లలకు మంచిగా చదివించడం ద్వారా పిల్లలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

పిల్లలకు చదువు విలువను తెలియజేయడం ద్వారా కూడా వాళ్లను మెంటల్ గా ఇంప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. పిల్లలకు చదువులో సహాయం చేయడం ద్వారా వాళ్లలో కొంతమేర మార్పు రావడంతో పాటు వాళ్లు చదువుపై సులువుగా దృష్టి పెడతారని చెప్పవచ్చు. పిల్లల చదువును పూర్తిస్థాయిలో టీచర్లపై వదిలిపెట్టడం కూడా లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

పిల్లలు మార్కులపై మాత్రమే శ్రద్ధ పెట్టకుండా పిల్లలు సబ్జెక్ట్ కూడా నేర్చుకునే విధంగా ప్రణాళికలు ఉండాలి. పిల్లలు మంచి మార్కులు సాధించిన సమయంలో తల్లీదండ్రుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తే పిల్లలు సైతం చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పిల్లలకు చదువుతో పాటు క్రమశిక్షణ మంచి, చెడు గురించి తెలియజేయాలి.

పిల్లలు చిన్నచిన్న తప్పులు చేస్తే అర్థమయ్యేలా వివరించడం ద్వారా వాళ్ల భవిష్యత్తుకు మంచి పునాది వేసిన వాళ్లం అవుతామని చెప్పవచ్చు. పిల్లల చదువు విషయంలో తప్పటడుగులు వేస్తే దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.