తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మునుగోడు ఉపఎన్నికలో టీడీపీ కూడా ఎంట్రీ ఇచ్చిందని ప్రచారం జరిగింది. కొన్నిరోజుల క్రితం వరకు సైలెంట్ గా ఉన్న టీడీపీ ప్రస్తుతం ఓట్లను చీల్చాలనే ఆలోచనతో ఎంట్రీ ఇచ్చినట్టు కామెంట్లు వినిపించాయి. టీడీపీ ఎంట్రీతో టీ.ఆర్.ఎస్ నష్టపోయే అవకాశం ఉండగా లాభపడే పార్టీ ఏదనే ప్రశ్నకు బీజేపీ పేరు సమాధానంగా వచ్చింది. మునుగోడులో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ అనే సంగతి తెలిసిందే.
టీడీపీ తరపున జక్కలి ఐలయ్య యాదవ్ పోటీ చేయనున్నారని వార్తలు వచ్చాయి. మునుగోడు ఉపఎన్నిక కోసం ఇప్పటికే టీ.ఆర్.ఎస్, బీజేపీ ఊహించని స్థాయిలో ఖర్చు చేస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ తరపున ఇక్కడ గద్దర్ పోటీ చేయనున్నారు. టీడీపీ పోటీ చేయనుందని వచ్చిన వార్తలు హరీష్ రావును సైతం టెన్షన్ పెట్టడంతో ఆయన ఆ వార్తల గురించి స్పందించి విమర్శలు చేయడం గమనార్హం.
అయితే టీడీపీ చివరకు చావు కబురు చల్లగా చెప్పింది. టీడీపీ ఈ ఉపఎన్నికకు దూరంగా ఉండనుందని ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదని టీడీపీ నేత బక్కని నర్సింహులు తెలిపారు. టీడీపీ కామెంట్లతో టీ.ఆర్.ఎస్ కూల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఒక పార్టీ పోటీ చేస్తామని ప్రకటించినంత మాత్రాన టీ.ఆర్.ఎస్ టెన్షన్ పడటం పార్టీ పోటీ చేయకపోతే కూల్ కావడం కరెక్ట్ కాదు.
పరిస్థితులు ఎలా ఉన్నా పోటీలో విజయం సాధిస్తామనే నమ్మకాన్ని కలిగి ఉంటే మాత్రమే విజయం దక్కే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బీఎస్పీ, ప్రజాశాంతి పార్టీలు కూడా పోటీ చేస్తుండగా ఈ పార్టీల అభ్యర్థులకు పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఖర్చు విషయంలో వెనుకాడకుండా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం కనీవిని ఎరుగని స్థాయిలో ఖర్చు చేస్తుండటం గమనార్హం.
