టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అందులో ఒకటే ప్రజల గొంతుక అయిన ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ మూసివేత. టిఆర్ఎస్ సర్కారు అధికారంలోకి రాగానే ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్ మూసివేసింది. తర్వాత చాలామంది నిరసనకారులు ధర్నా చౌక్ లేకపోవడంతో సిఎం కేసిఆర్ నివాసముంటున్న అత్యాధునిక భవనం ప్రగతి భవన్ పరిసరాల్లో ధర్నాలు చేపడుతూ తమ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ అధికారికంగా పలానా చోటులో తమ నిరసనలు వెల్లడించుకోవచ్చు అని సర్కారు ఎక్కడా ఏర్పాటు చేయలేదు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు అప్పట్లో హైకోర్టులో కేసు వేశారు. అయితే ఇందిరా పార్కు ధర్నా చౌక్ ఎత్తివేతపై టిఆర్ఎస్ సర్కారు కూలిపోయిన తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. టిఆర్ఎస్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ధర్నా చౌక్ కొనసాగించాల్సిందే అని మధ్యంతర తీర్పులో వెల్లడించింది. పోలీసులు జనాలకు ఇబ్బందైతుంది.. ఇంకేదో అయితుందని కోర్టుకు చెప్పినా కోర్టు పట్టించుకోలేదు. ధర్నా చౌక్ ను కొనసాగించాల్సిందే అని ఆదేశాలు ఇచ్చింది. ఇందిరా పార్కు వద్దనే ధర్నా చౌక్ కొనసాగించాలని ఆదేశించింది.
తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నా చౌక్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం పెద్ద వివాదమైంది. తెలంగాణ రాకముందే వందల సార్లు ఇదే ధర్నా చౌక్ లో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేశారు. తమ నిరసనలు తెలిపారు. ఏకంగా కేసిఆర్ సైతం అనేకసార్లు ఇక్కడే ధర్నాలో పాల్గొన్న పరిస్థితి ఉంది. కానీ ఏమైందో ఏమో సర్కారుకు దుర్బుద్ధి కలిగిందని, అందుకే ధర్నా చౌక్ ఎత్తేసిందని ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అనిచివేయడమే లక్ష్యంగా కేసిఆర్ ధర్నా చౌక్ ఎత్తివేశారని, ధర్నా చౌక్ పరిరక్షణ కోసం అనేక రూపాల్లో తెలంగాణ జెఎసి, ఇతర ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పోరాటం చేయాల్సి వచ్చింది. న్యాయపోరాటంలో అంతిమంగా టిఆర్ఎస్ సర్కారుకు చుక్కెదురైంది.
ధర్నా చౌక్ పునరుద్ధరణ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ 6 వారాల వరకు ధర్నా చౌక్ ను యధావిధిగా కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 6 వారాలు పరిశీలించిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో స్పందిస్తామని తెలిపింది న్యాయస్తానం. ఇప్పటి నుండి ధర్నా చౌక్ లో యదావిధిగా ప్రొటెస్ట్ లు జరుపుకోవచ్చని కోర్టు వెల్లడించింది.
తెలంగాణలో టిఆర్ఎస్ సర్కారు తీసుకున్న అనేక నిర్ణయాలను కోర్టులు నిలువరించాయి. ప్రజా వ్యతిరేక విధానాలు కావడం, నిరంకుశ, పక్షపాత విధానాలు కావడం, కక్ష సాధింపు విధానాలు కావడంతో కోర్టుల్లో టిఆర్ఎస్ సర్కారు అనేక సందర్భాల్లో మొట్టికాయలు తప్పలేదు. సుమారు 40 విధానాల్లో కోర్టుల నుంచి టిఆర్ఎస్ సర్కారుకు మొట్టికాయలు పడ్డాయి. ఫీజు రీయంబర్స్ మెంట్ విషయంలో తీసుకొచ్చిన పాస్ట్ పథకం నుంచి మొదలుకొని మొన్న సర్కారు రద్దు కాకముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వ రద్దు వరకు అనేక కేసుల్లో సర్కారుకు వాయింపులు తప్పలేదు.