ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టు మరోసారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇతర రాష్ర్టాల నుంచి మద్యం బాటిళ్లను స్వరాష్ర్టంలోకి తీసుకురావొచ్చని హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. జీవో నెంబర్ 411 ప్రకారం ఇతర రాష్ర్టాల నుంచి మూడు మద్యం బాటిళ్లను వెంట తీసుకురావొచ్చిన తెలిపింది. ఏపీ ప్రభుత్వం కచ్చితంగా ఆజీవోని అమలు చేసి తీరాలని ఆదేశాలిచ్చింది. దీంతో జగన్ కి మరోసారి హైకోర్టు నుంచి గట్టి షాక్ తగిలినట్లైంది. ఏపీలో లిక్కర్ అధిక ధరలకు విక్రయించడం తో మందు బాబులు వైన్ షాపుల వైపు చూడటం మానేసారు. అంత డబ్బు వెచ్చించే బధులు ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిందని కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇతర రాష్ర్టాల నుంచి మద్యం బాటిళ్లను ఏపీలోకి తీసుకురావడం ఎక్కువైంది. తెలంగాణ రాష్ర్టం నుంచి అధిక మొత్తంలో బోర్డర్లు దాటించి విక్రయాలు జరిగాయి. అయితే పోలీసులు ఒక్క బాటిల్ తో దొరికినా అదుపులోకి తీసుకునేవారు. అడ్డగోలుగా ఫైన్లు కట్టించేవారు. ఈ నేపథ్యంలో కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. తాజాగా హైకోర్టు మూడు బాటిళ్లను ఇతర రాష్ర్టాల నుంచి తీసుకొచ్చుకునే వెసులు బాటు కల్పించింది. దీంతో మందుబాబులకు ఊరట దక్కింది. ఏపీలో డబ్బులు పోసినా సరైన మద్యం దొరకలేదని, కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి అనారోగ్యం కొని తెచ్చుకోవాల్సి వస్తోందని మందు బాబులు ఆరోపించారు.
ఇప్పుడా బాధలు సరిహద్దు ప్రాంతాల వారికి..ఇతర రాష్ర్టాల నుంచి ప్రయాణాలు సాగించే వారికి వెసులుబాటు దొరికింది. ప్రస్తుతం ఏపీలో లిక్కర్ అమ్మకాలు పడిపోయాయి. జగన్ మోహన్ రెడ్డి మద్యం బ్యాన్ దిశగా అడుగులు వేస్తోన్న నేపథ్యంలోనే ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. కొంత వరకూ ఫలితాలు కనిపించాయి. అయితే తాజాగా హైకోర్టు తీర్పుతో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయి? అన్నది చూడాలి. ఇప్పటికే కొన్ని తీర్పులతో జగన్ సర్కార్ కి భగపాటు తప్పని సంగతి తెలిసిందే.