ఏపీ హైకోర్టులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి యంత్రాగానికి ఎదురవుతోన్న భంగపాట్లు గురించి తెలిసిందే. ఏ కేసు విచారణకు వచ్చినా..ఎవరు పిల్ వేసినా ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పడం లేదు. చాలా అరుదుగానే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులొచ్చాయి. కీలకమైన కేసులన్నింటిపై సుప్రీంకోర్టులో సవాల్ కు వెళ్లినా చుక్కెదురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ పిటీషనర్ వేసిన కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తాత్కలిక ఉపశమనం దక్కింది. అమ్మఒడి పథకానికి దేవాదయ శాఖ నిధుల్ని మళ్లీంచారంటూ ఓ వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసారు.
ఈ పిటీషన్ విచారణ సందర్భంగా ఆ వ్యక్తికి చురకలంటించింది కోర్టు. పిటీషన్ లో సరైన ఆధారాలు లేకపోవడంతో వివరాలు లేకుండా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేయడం ఎక్కువైందని అడ్వోకట్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేసారు. వాదనతో ఏకీభవించి హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. నిధులు మళ్లించలేదని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. దేవాదయ శాఖలో బ్రాహ్మాణ కార్పోరేషన్ భాగం కాదని నిధులు మళ్లీస్తున్నట్లు జీవోలో ఎక్కడా చెప్పలేదని ఏజీ తెలిపారు.
ఇలాంటి పిటీషన్లపై న్యాయస్థానం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు అడ్వకేట్ జనరల్ వాదనల్ని పరిగణలోకి తీసుకుని అమ్మఒడి పథకానికి నిధులు మళ్లీ స్తున్నారని ఎలా చెబుతారని ప్రశ్నిచింది. అందుకు ఆధారాలు కావాలన్నారు. దీనికి పిటీషనర్ సరైన బధులు చెప్పలేకపోయారు. దీంతో పిటీషన్ కొట్టేయడానికి న్యాయస్థానం సిద్దమైంది. ఇంతలో పిటీషనర్ అదనపు సమాచారంతో అఫిడవిట్ దాఖలకు సమయం కావాలని అడిగాడు. అందుకు కోర్టు గడువుతో కూడిన అనుమతిచ్చింది.