టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన సీనియర్ నేతను టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. యాదాద్రి జిల్లాఆత్మకూరు(ఎం) మండలం మొర్పిరాల టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, గ్రామశాఖ కార్యదర్శిగా నిమ్మల దశరథ కొనసాగుతున్నారు. దశరథ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించారని తేలింది. దీంతో అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు గ్రామశాఖ అధ్యక్షుడు ముప్పిడి రాజయ్య, సర్పంచ్ సామ తిరుమల్‌రెడ్డి తెలిపారు.
మొర్పిరాల గ్రామంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ గ్రామశాఖ సమావేశంలో వారు మాట్లాడుతూ… పార్టీలో కార్యదర్శిగా కొనసాగుతూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించినట్టు తమ విచారణలో తేలిందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించినందున అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు.