కొన్ని రోజుల క్రితం తెలంగాణ బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు తీరును తప్పు పడుతూ.. అదే సమయంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్ పై ఈటల మాటలు ఎఫెక్ట్ చూపించాయని తెలుస్తుంది. తాజాగా కేసీఆర్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలే దీనికి కారణం!
జీవో111 ను రద్దు చేస్తూ కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టిన ఈటల రాజేందర్.. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో కేసీఆర్ సర్కార్ సరైన పనులు చేయలేదని, అర్హులపై పేదలకు కాకుండా పార్టీ జనాలకు పంచిపెడుతున్నారని విమర్శలు చేశారు. ఈ సమయంలో… పక్క రాష్ట్రంలోని జగన్ సర్కారు పేదల కోసం లక్షలాది ఇళ్లు నిర్మిస్తుందంటూ సంచలన కామెంట్లు చేశారు. ఈ విషయాలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్… తాజాగా జగన్ ను ఫాలో అవుతున్నట్లు పరోక్షంగా ప్రకటించారు!
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ భారీ గుడ్ న్యూస్ చెప్పారు. అవతరణ వేడుకల్లో భాగంగా మొదట గన్ పార్క్ వద్ద సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మైకందుకున కేసీఆర్… తెలంగాణలోని ప్రతీ గ్రామంలోనూ అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
దీంతో కీబోర్డులకు పనిచెప్పారు నెటిజన్లు. ఈటల మాటల ఎఫెక్ట్ కేసీఆర్ పై బాగా పనిచేసిందని కొందరు అంటుంటే… జగన్ పథకం గొప్పతనం కేసీఆర్ ఆలస్యంగా గ్రహించారంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికైనా మించి పోయింది లేదు… ఇండ్ల స్థలాలు ఇవ్వడమే కాదు… గ్రామాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని.. అలాకానిపక్షంలో అమరావతిలో తాజాగా పట్టాలు తీసుకున్నవారికి ఇస్తున్నట్లు బిల్డింగ్ మెటిరీయల్ లో భారీ సబ్సిడీ అయినా ఇప్పించాలని కోరుతున్నారు!