Bharatpol: భారత్‌పోల్: నేరగాళ్లను పసిగట్టే సరికొత్త సాంకేతిక పోర్టల్

మరోసారి కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి నేరస్థులను అదుపులో పెట్టే దిశగా కీలక అడుగువేసింది. దేశం నుంచి పారిపోయిన నేరగాళ్లను గుర్తించడం, ఇంటర్‌పోల్‌ సహాయంతో వారిని పట్టుకోవడం కష్టతరమవుతుండగా, ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘భారత్‌పోల్’ పోర్టల్‌ను ప్రారంభించారు. సీబీఐ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల కదలికలపై మెల్లగా కాకుండా వేగంగా చర్యలు తీసుకోవడం సులభమవుతుంది.

ఇంతకు ముందు నేరగాళ్లపై చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు నేరుగా సీబీఐను ఆశ్రయించేవి. సీబీఐ ఆధ్వర్యంలో ఇంటర్‌పోల్‌ కార్యాలయం సంప్రదించాల్సి ఉండేది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకోవడంతో నేరగాళ్లు తమ లొకేషన్ మార్చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు భారత్‌పోల్‌తో ఈ సమస్యకు సమాధానం దొరికింది.

ఈ పోర్టల్‌ ద్వారా రాష్ట్ర పోలీస్ శాఖలు నేరుగా ఇంటర్‌పోల్‌ అందుబాటులోకి రాగా, నేరగాళ్లపై రెడ్ కార్నర్ నోటీసులు, ఇతర నోటీసులు వేగంగా జారీ చేయడం సాధ్యమవుతుంది. ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ సిస్టమ్‌ ద్వారా దేశంలో ఉన్న క్రిమినల్ రికార్డులను చిటికెలో ఇంటర్‌పోల్‌కు చేరవేయవచ్చు. అంతేకాదు, అంతర్జాతీయ నేరగాళ్లు ఎక్కడ ఉన్నా వారిని ట్రాక్ చేయడం, అవసరమైన సమాచారం పొందడం ఈ పోర్టల్ సులభతరం చేస్తుంది. భారత్‌పోల్ ప్రారంభం వల్ల, నేరగాళ్లను త్వరగా పట్టుకోవడమే కాకుండా, భవిష్యత్తులో అంతర్జాతీయ నేర నియంత్రణలో భారత్ కీలక పాత్ర పోషించగలదని నిపుణులు విశ్వసిస్తున్నారు.

Ap Public Talk On Arogya Sri Scheme || Ap Public Talk || Chandrababu || Ys Jagan || Telugu Rajyam