నిరుద్యోగ యువతకుఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఖాళీగా ఉన్నటువంటి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కు నోటిఫికేషన్ విడుదల చేసి రాత పరీక్షలను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. రాత పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకి ఫిసికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించారు.ఈ క్రమంలోనే డిసెంబర్ 8వ తేదీ నుంచి ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు డిసెంబర్ 8 గురువారం నుంచి ప్రారంభమయ్యాయని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ వెల్లడించారు.
అభ్యర్థుల శారీరక దారుడ్య పరీక్షలకు 600 మంది అభ్యర్థులకు గాను 494 మంది అభ్యర్థులు హజరైయ్యారని తెలిపారు. పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న అభ్యర్థులకు సీరియల్ నెంబర్ ప్రకారం టోకన్స్ జారీ చేసి, 50 మంది అభ్యర్థులను ఒక్కొక్క బ్యాచ్ గా చేసి డాక్యుమెంట్స్ పరిశీలన కౌంటర్ వద్ద తరలించారు.అనంతరం రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత రిస్ట్‌బాండ్ టాగింగ్, ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్ జాకెట్ ధరింపజేశారు. అనంతరం 1,600 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు.
డిసెంబర్ 8వ తేదీ ప్రారంభమైన ఈ ఫిజికల్ టెస్ట్ పరీక్షలు జనవరి మూడవ తేదీ వరకు ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్నట్లు వెల్లడించారు. ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలకు 24733 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో 4,700 మంది మహిళలు, 20,033 పురుషులు హాజరుకానున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు.