రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరని అందరికీ తెలుసు. అలాగే రాజకీయాల్లో ఎవరి పెత్తనం ఎల్లకాలం సాగదని కూడా అందరికి తెలుసు. అయినా తమ పెత్తనం నడిచినప్పుడు మాత్రం ఈవేవి తలకెక్కకువు చాలా మంది నేతలకు. దీంతో కాలక్రమంలో అందరికీ దూరమై ఒంటరైపోతుంటారు. ఇలాంటి నేతలు రాష్ట్ర రాజకీయాల్లో కోకొల్లలు. అటు తెలంగాణకు ఇటు ఏపీకి మధ్య ఉన్న ఖమ్మం జిల్లా వాసులు కూడా తమ జిల్లా రాజకీయాలపై తమకున్న అనుభవంతో ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. తమ రాజకీయాల్లో నేతలు మారిన… రాజకీయ వైఖరులు మాత్రం మారలేదని అంటున్నారు. టీడీపీ హయాంలో మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు హవా నడిచిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా ఎవరిన్ని ఎదగనిచ్చేవారు కాదని చెబుతున్నారు. తన అనుమతి లేకుండా ఏపని జరగనిచ్చేవారని చెబుతున్నారు. దీంతో ఏ పని కావాలన్నా.. ఎంతటి వారైనా.. తుమ్మల అనుమతి కోసం క్యూకట్టేవారని చెబతున్నారు. అయితే అలా తన హవా నడిపించిన ఆయన ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో పత్తాలేకుండా పోయారని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన పంథాలోనే మంత్రి పువ్వాడ అజయ్ నడుచుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు.
కేసీఆర్ అండదండలతో మంత్రిగా జల్లాను శాసిస్తున్న పువ్వాడ అచ్చం తుమ్మలలాగే వ్యవహరిస్తున్నారని చెబుతున్నరు. కేసీఆర్ మద్ధతు ఉందని గ్రహించిన జిల్లా నేతలంతా ఇప్పుడు ఉవ్వాడకు జై కొడుతున్నారు. ఆయన ఏదంటే మిగతా వాళ్లు అందే అంటున్నారు. దీంతో జిల్లా రాజకీయాల్లో అన్నీ తానై పువ్వాడ వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఎంపీ నామా నాగేశ్వరరావు వంటి సీనియర్లకు ఇబ్బందికరంగా మారింది. గతంలో తమ్మలతో ఇబ్బంది పడ్డ నామా నాగేశ్వర్ రావు ఇప్పుడు వువ్వాడతో ఇబ్బందిపడుతున్నారని చెబుతున్నారు.
తుమ్మల పంథాలోనే వెళ్తే పువ్వాడ కూడా తన వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీసుకోవడం ఖాయమని అంటున్నారు. ఇదే విషయాన్ని నామా నాగేశ్వర్ రావు కూడా తన వర్గానికి చెబుతున్నారట. అయితే ఎంత మంది ఎన్ని రకాలు చెప్పినా వువ్వాడ మాత్రం తన పంథా మార్చుకోవడం లేదట. తమ్మలను , పువ్వాడ గుర్తు చేస్తున్నారట.