టీఆర్ఎస్ పార్టీకి చివరి అవకాశం ఏంటో తెలుసా!! ఇక్కడ కూడా ఓడిపోతే ఇక కేసీఆర్ ఇంటికే

this is the factor that effects on trs party in greater elections

తెలంగాణలోని రాజకీయ గత కొన్ని నెలల నుండి విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. తనను రాజకీయంగా ఎదుర్కొనే శక్తి తెలంగాణలో లేదని భావించిన సీఎం కేసీఆర్ కు బీజేపీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దుబ్బాక ఎన్నికలతో మొదలు పెట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రజలలో కేసీఆర్ పై వ్యతిరేకత పెరగడమే కారణమని చెప్తున్నారు. అయితే కేవలం ఈ రెండు ఎన్నికలతో కేసీఆర్ రాజకీయ జీవితం ముగిసిందని చెప్పలేం. తమ ప్రభుత్వంపై ప్రజలకు ఎలాంటి వ్యతిరేకత లేదని నిరూపించుకోవడానికి టీఆర్ఎస్ ఇంకో అవకాశం లభిచింది.

cm  kcr
cm kcr

టీఆర్ఎస్ కు వచ్చిన అవకాశం

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోరంగా దెబ్బతిన్న టీఆర్ఎస్ ఇప్పుడు తమ పాలన గురించి నిరూపించుకోవడానికి ఇంకా అవకాశం దొరికింది. ఆ అవకాశమే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో గనుక టీఆర్ఎస్ అత్యధిక మెజారిటీతో గెలిస్తే రాజకీయంగా టీఆర్ఎస్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒకవేళ ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఓడిపోతే ఏపీలో టీడీపీ పరిస్థితికి చేరుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ రెండు చోట్ల టీఆర్ఎస్ అధికారంలో ఉంది. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఈ రెండు కార్పొరేషన్లను ప్రతిష్టాత్మంకగా తీసుకున్నారు. గనుక గెలవడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి.

బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలను తిప్పికొట్టగలదా!!

వరంగల్ కార్పొరేషన్ లో కొంత కాంగ్రెస్ కు బలముంది. బీజేపీకి అంతగా లేదు. అయినా బీజేపీ ఈ మధ్య కాలంలో అక్కడ పట్టుపెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇక్కడ బలంగా ఉండటంతో వరంగల్ గ్రేటర్ ఎన్నికలు టీఆర్ఎస్ కు ఛాలెంజ్ గా మారనున్నాయి. అలాగే బీజేపీపై ఇప్పుడు ప్రజలకు నమ్మకం పెరిగింది. కనుక ఖమ్మం, వరగంల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.