దివంగత నేత పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి ప్రస్తుతం ఖైరతాబాద్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఉన్నారు. సెప్టెంబర్ 2 వ తేది నాడు ప్రగతి నివేదన సభ ఉన్న సంధర్బంగా కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు విజయారెడ్డి కార్యకర్తల సమావేశం చేశారు. కార్యకర్తలను సమావేశానికి రావాలని కోరారు.
టిఆర్ ఎస్ కండువా వేసుకున్నోడు ప్రతి ఒక్కడు లీడర్.. వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కాదు లీడర్లు.. కండువా వేసుకున్న ప్రతి ఒక్కరూ లీడరేనన్నారు. 2 వతారీఖు నాడు అందరూ రావాలా నాయకుడు చెప్పినట్టు సభను విజయవంతం చేయాలా అని అన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినా పార్టీ చెప్పిందని ఒక మెట్టు దిగి కార్పొరేటర్ గా పోటి చేసి గెలిచానన్నారు. విజయారెడ్డి మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.