తుంగతుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టిఆర్ ఎస్ అభ్యర్ధి గాదరి కిషోర్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. మోత్కూరులోని అన్నెపువాడ కాలనీలో ప్రచారం చేస్తున్న గాదరి కిషోర్ ను కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఏ ముఖం పెట్టుకోని మళ్లీ ఓట్లు అడగడానికి వచ్చావంటూ నిలదీశారు. నీళ్లు వచ్చినయా, రోడ్లు వేసినరా, ఏం అభివృద్ది చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల ఆగ్రహంతో చేసేదేం లేక గాదరి కిషోర్ కుమార్ అక్కడ నుంచి వెనుదిరిగారు. ప్రజలు ఆందోళన చేసిన వీడియో కింద ఉంది చూడండి.