నమస్తే తెలంగాణ పేపర్ లీలలు

నమస్తే తెలంగాణ లీలలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన వారే ఎలా డప్పు కొట్టుకుంటున్నారో అర్దమైతుందని నమస్తే తెలంగాణ వీక్షకులు అంటున్నారు. ఎన్నికల సందర్బంగా నమస్తే తెలంగాణ డిస్టిక్ పేపర్ లో ఓటరు గళం పేరుతో ప్రజలందరి వాయిస్ తీసుకొని ప్రతి పేజికి ప్రచురిస్తున్నారు.

తాజాగా అశోక్ గుప్త అనే వ్యక్తి ఫోటోతో సహా అతని బైట్ ను ప్రచురించారు. ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పడం హర్షనీయమన్నారు.

అదే అశోక్ గుప్తా ఫోటో వేసి శ్రీకాంత్ రెడ్డిగా మార్చి రెడ్డి సంక్షేమం కోసం మాట్లాడినట్టు మళ్లీ ప్రింట్ చేశారు. ఒకే వ్యక్తి రెండు బైట్లు.. ఒకటి రెడ్డి కార్పొరెషన్ కోసం మరొకటి ఆర్య వైశ్యుల కోసం మాట్లాడినట్టు చూపించారు. ఇంతకీ ఆ ఫోటో లో ఉన్న వ్యక్తి రెడ్డినా లేక ఆర్య వైశ్యనా అని పేపర్ చదివిన జనాలు చర్చించుకుంటున్నారు. అసలు ఆయన అశోక్ గుప్తానా లేక శ్రీకాంత్ రెడ్డినా అని అంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్ వాళ్లే ప్రచారం కోసం ఇలా మార్చి మార్చి వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఒకే వ్యక్తిని రెండు పేర్లతో చూపించిన నమస్తే తెలంగాణ

గతంలో కూడా ప్రభుత్వ పథకాల ప్రకటన ఇచ్చినప్పుడు ఒక భార్య ఇద్దరు భర్తలను చూపించారు. అది కూడా గతంలో రచ్చరచ్చ అయ్యింది. ఆ ప్రకటన ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చిన తర్వాతే అన్ని పేపర్లలో యాడ్స్ గా వచ్చింది.  అందరికి ఆదర్శంగా ఉండాల్సిన పత్రిక రాజకీయాల కోసం సొంత డబ్బా కొట్టుకోవడం కోసం దిగజారుడు ఏంది అని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.