నల్లగొండ పట్టణంలోని 32 వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్ధి ప్రచారానికి వస్తున్నారని తెలుసుకొని ముస్లింలు అంతా తమ షాపులకు తాళాలు వేసి నిరసన తెలిపారు. టిఆర్ ఎస్ పార్టీ ముస్లింలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని,వక్ఫ్ బోర్డు ఏర్పాటు ఏమైందని ప్రశ్నిస్తూ షాపులకు పోస్టర్లను అతికించారు.
ముస్తింలు నిరసన తెలుపుతున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని షాపులను తెరిపించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. ముస్లింలు పోస్టర్లు అతికించిన ఫోటోస్ కింద ఉన్నాయి చూడండి.