కేటీఆర్,కేసీఆర్ లను ఉద్దేశించి రామ్ చరణ్

తెలంగాణ ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి సరి కొత్త చ‌రిత్ర‌ని సృష్టించి అందరి అంచనాలు తలక్రిందలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రిగిన తొలి ఎన్నిక‌లు కావటంతో దేశం మొత్తం ఈ ఎలక్షన్స్ రిజల్ట్ వైపు చూసింది. అయితే తెరాస క్లీన్ స్వీప్ చేయటం,…. 88 స్థానాల్లో ఘన విజ‌యం సాధించటంతో . కేసీఆర్‌కి ప్ర‌ధాని మోదీ స‌హా అగ్ర‌నేత‌లంతా అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు తెలియచేసారు.

ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి స్టార్ హీరో రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ద్వారా అభినందనలు తెలియచేసారు. కేటీఆర్,కేసీఆర్, కవిత,హరీష్ రావులకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు.