హైదరాబాద్ నగరంలో భారీ చోరి… కోటి రూపాయలు విలువచేసే బంగారం, వజ్రాలు మాయం..?

సాధారణంగా కొంతమంది దొంగ ముఠాలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దోచుకెళితు ఉంటారు. మరి కొంతమంది దొంగలు బంగారు దుకాణాలలో బ్యాంకులలో చోరీలకు పాల్పడుతూ కోట్లు కోట్లు డబ్బు బంగారు నగలు దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలా రోజురోజుకి దొంగతనాలు పెరిగిపోవటంతో బంగారు షాపు యజమానులు చాలా జాగ్రత్తగా వహిస్తూ తమ దుకాణాలకు హై సెక్యూరిటీ పెడుతున్నారు. అయినప్పటికీ కొంతమంది దొంగలు చాలా నైపుణ్యంగా దుకాణాలలో చొరబడి మొత్తం దొచుకొనిపోతున్నారు.

తాజాగా హైదరాబాద్ మహానగరంలో కూడా భారీ చోరి జరిగింది. ఒక దుకాణంలో కోటి రూపాయలు విలువ చేసే బంగారం, వజ్రాలు అపహరించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ సైట్ 2లో చోటు చేసుకుంది. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం…ఫిలింనగర్ పరిధిలో పవన్ కుమార్ అనే వ్యక్తి శమంతక డైమండ్స్ పేరుతో బంగారు, వజ్రాల ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కస్టమర్ల నుంచి ఆర్డర్స్ తీసుకుని.. సూరత్ నుంచి బంగారం ముడి సరుకు తీసుకొచ్చి ఆభరణాలు చేయించి ఇస్తుంటారు.

ప్రతీ రోజులాగే మంగళవారం రోజు కూడా కొన్ని ఆభరణాలు తయారీ చేసి మిగిలిన ముడి సరుకును షాప్ లో ఉన్న లాకర్ లో పెట్టి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం వచ్చి షాప్ తెరచి చూడగా లాకర్ లో ఉంచిన బంగారం, వజ్రాలు కనిపించకపోయేసరికి షాప్ మొత్తం వెతికాడు. అయితే కనిపించకపోవడం తో తన దుకాణంలో దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుకాణం మొత్తం పరిశీలించారు. ఈ క్రమంలో దుకాణంలో ఉన్న కోటి రూపాయల విలువచేసే బంగారం, వజ్రాలు దొంగతనం జరిగినట్లు షాప్ యజమాని పోలీసులకు తెలియజేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Gold worth Rs.1 Crore Robbery in Banjara Hills | Hyderabad | Sakshi TV