TG: తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అనే విధంగా నేతల మధ్య తరచూ మాటల యుద్ధం నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పై బిఆర్ఎస్ నేతలు విమర్శల వర్షం కురిపించగా అందుకు కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు సైతం బిఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఈయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ సిగ్గుందా సైకోరామ్? నువ్వు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నావా? కుటుంబ పాలన గురించి నువ్వు మాట్లాడే వ్యాఖ్యలకు అద్దం ముందు నీలుచుంటే కనుక నీ నీడే నీ పై ఉమ్మేస్తుందంటూ ఫైర్ అయ్యారు. ఎలాంటి పదవి లేకపోయినా మీ అయ్యకు టాబ్లెట్లు, టాయిలెట్ పేపర్లు అందించే సంతోష్ కుమార్ కు 1+1 సెక్యూరిటీ ఎవడు ఇచ్చిండని కేటీఆర్ ను ప్రశ్నించారు. రాజ్యసభ ఎంపీకి ఐఎస్ డబ్ల్యు ప్రోటోకాల్ కాకపోయినా 2+2 సెక్యూరిటీ ఎవడు పెట్టిండని నిలదీశారు.
మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కుటుంబంలో ఉన్న వారికే ఎమ్మెల్సీలు మంత్రులుగా పంపకాలు జరగలేదని మీలాగా ప్రతి జిల్లాలోనూ ఆస్తులను రేవంత్ రెడ్డి కుటుంబ పంచుకోలేదని తెలిపారు. మీ అయ్య కాలేశ్వరం మీ చెల్లి లిక్కర్, మీ తమ్ముడు మొక్కలు,మీ బావ కాకతీయ నువ్వేమో ఏ టు జెడ్ చేసిన కుంభకోణాలు మాదిరి రేవంత్ రెడ్డి కుటుంబం చేయలేదు అంటూ ఈయన కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాక్షేమం కోసం పరితపిస్తున్నారని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన ప్రజలకు సంక్షేమాన్ని పంచడంలో పాల్గొంటున్నారని రామ్మోహన్ రెడ్డి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ సంచలనంగా మారింది.