KTR: రాహుల్ గాంధీపై ‘ఇంటర్నేషనల్’ సెటైర్ వేసిన కేటీయార్.!

KTR

KTR: రాజకీయాల్లో విమర్శలు చేయడానికి అర్హత వుండాలా.? గెలిచినవాళ్ళు మాత్రమే రాజకీయ విమర్శలు చేయాలా.? నిజానికి, ఇలాంటి కొలమానాలు ఏమీ లేవు. అర్థ రూపాయి ఇస్తే చాలు సోషల్ మీడియా వేదికగా, ఎంతటివారినైనా విమర్శించే ‘పెయిడ్ బ్యాచ్’ అందుబాటులో వుందిప్పుడు.!

సరే, అసలు విషయానికొద్దం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ చెబుతోన్న జాతీయ పార్టీ విషయమై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ‘ఇంటర్నేషనల్’ వెటకారం చేశారు. ‘నేషనల్ పార్టీ పెట్టొచ్చు, ఇంటర్నేషనల్ పార్టీ కూడా పెట్టుకోవచ్చు..’ అంటూ సెటైర్ వేశారు రాహుల్ గాంధీ, కేసీయార్‌ని ఉద్దేశించి.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధ మీద ‘ఇంటర్నేషనల్ సెటైర్’ వేశారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీయార్.!

ఇంటర్నేషనల్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ, అమేధీలో ఓడిపోయారు. ఓడిపోయిన నాయకుడు, కేసీయార్ మీద విమర్శలు చేయడమా.? అన్నది కేటీయార్ ప్రశ్న. నిజమే, 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేధీలో ఓడిపోయారు. కానీ, అదే ఎన్నికల్లో ఆయన కేరళ నుంచి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అంతెందుకు, కేటీయార్ సోదరి కవిత కూడా ఓడిపోయారు. ఆమెకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చి చట్ట సభకు పంపుకున్నారు ఆమె తండ్రి కేసీయార్. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణమే.

‘రాహుల్ గాంధీని విమర్శిస్తున్నావ్.. మీ చెల్లెల్ని గెలిపించుకోలేని నువ్వు.. కూతుర్ని గెలిపించుకోలేని మీ నాన్న ఇతరుల్ని విమర్శిస్తారా.?’ అంటూ కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టేశాయ్.