తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. దేశంలోని ద్రవ్యోల్బాణాన్ని, చొరబాటిదారులను నియంత్రించలేని ప్రధానిని ఏమంటారు అని తన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు.
అంతేకాకుండా నాలుగు ఆప్షన్లను కూడా ఇచ్చాడు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని.. అయితే శాటిలైట్ ఫోటోలతో జాతీయ మీడియా ఈ కథనాలను ప్రచురించడంతో కేటీఆర్ రంగంలోకి దిగారు. ఇలాంటి ప్రధానిని ఏమని పిలుస్తారు అంటూ.. ఎ. 56″ బి. విశ్వ గురు సి. అచ్చేదిన్ వాలే డి. పైన పేర్కొన్నవన్నీ అంటూ ఆప్షన్లు ఇవ్వగా.. అన్ పార్లమెంటరీ పదాలు కాబట్టి తొలగించబడ్డాయి అంటూ వెటకారం చేశారు.