KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచూ అధికార ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అలాగే మీడియా సమావేశాలలో మాట్లాడుతూ రేవంత్ సర్కారుకు సవాల్ విసురుతున్నారు. ఇకపోతే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సర్కారుకు కాళేశ్వరం గురించి ప్రశ్నలు వేశారు.
కెసిఆర్ హయామంలో ఎంతో కొంత మంది రైతుల దాహార్తిని వ్యవసాయ పొలాలకు అనుగుణంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు ఇక ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ ఓ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ విచారణను కొనసాగిస్తోంది.
ఈ ప్రాజెక్టుల భాగస్వామ్యం అయినటువంటి ఇంజనీర్లను అధికారులను విచారణ చేస్తూనే ఉన్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం పై ఈయన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. కాళేశ్వరంపై ఎంత విషం చిమ్మినా తెలంగాణ ప్రజల దాహార్తి తీరుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేస్తున్నారని.. అయినప్పటికీ కాళేశ్వరం తెలంగాణను సస్యశ్యామలం చేసిందన్నారు. కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది అనేది కేవలం ఒక అబద్ధపు ప్రచారం మాత్రమే అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
ఇలా ఎంతోమందికి అండగా నిలిచిన ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ చేసిన అవినీతి ఆరోపణలు తప్పు అని గ్రహించి ఇప్పటికైనా చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అంటూ ఈయన డిమాండ్ చేశారు.కాళేశ్వరం కూలిపోయిందని కాకమ్మ కథలు చెప్పావని, అధికారం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పై నిందలు వేసినా, నేడు ప్రజల దాహార్తి తీర్చే ఏకైక అస్త్రం కాళేశ్వరం అంటూ ఈయన ప్రభుత్వ తీరు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎంత విషం చిమ్మినా…తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం!
మల్లన్నసాగర్ వద్దని నిరాహారదీక్షలు మీరు చేసినా…నేడు మహనగర దాహార్తి తీరుస్తున్న వరప్రదాయిని మల్లన్నసాగర్!
కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేసినా!
తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం!ఇప్పుడైనా… pic.twitter.com/GHVRj3fokN
— KTR (@KTRBRS) January 4, 2025