Konda Surekha: బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ది థర్డ్ ప్లేస్ అని, అందుకే ఆయన మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటూ కేటీఆర్ పై మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యవహార శైలి కారణంగా బిఆర్ఎస్ పార్టీ పరువు ప్రతిష్ట దిగజారిపోతున్నాయి. దీంతో మాజీ మంత్రి హరీష్ రావు, కవిత ఒకటవ్వాలని చూస్తున్నారు.
నిజానికి తన చెల్లెలు కవిత జైలులో ఉన్నప్పుడే కేటీఆర్ చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనలో సంతోషం కరువైందంటూ కొండా సురేఖ మాట్లాడారు.హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనల్లో కుట్ర దాగి ఉందని ఈ కుట్ర వెనుక బిఆర్ఎస్ నేతలు ఉన్నారని ఈమె మండిపడ్డారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ రోజు కూడా ఇలా హాస్టల్ వసతుల గురించి ఆలోచించలేదని తెలిపారు.
బిఆర్ఎస్ హయాంలో హాస్టల్ భోజనంలో పురుగులు కాదు కప్పులు కూడా వచ్చిన ఘటనలు ఉన్నాయని కొండా సురేఖ తెలిపారు.ప్రతి ఘటనపై విచారణ చేస్తామని, దోషులెవరో తేల్చుతామని మంత్రి స్పష్టం చేశారు. లగచర్ల ఘటన విషయంలో కేటీఆర్ ప్రభుత్వ అధికారులపై నోరు పారేసుకోవడం సబబు కాదని తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై మర్డర్ ప్లాన్ కూడా చేశారని ఈమె తెలిపారు. ఇక సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు తిట్టారని ప్రజలు ఛీ కొట్టి తిరస్కరించిన ఈ సైకో రామ్ కు ఇంకా బుద్ధి రాలేదు అంటూ కొండ సురేఖ కేటీఆర్ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేటీఆర్ గత ఏడాది కాలంలోనూ అలాగే గత ప్రభుత్వ సమయంలో ఈయన చేసిన తప్పులకు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయనకు తెలుసు అయితే తాను చేసిన తప్పులు వల్ల జైలుకు వెళుతున్నానని విషయాన్ని దాచి పెడుతూ మూసీ గిరిజన ప్రజల కోసం,అడ్డం పెట్టుకుని జైలుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. తానేదో స్వతంత్ర సమరయోధుడిలా ప్రజల కోసం జైలుకు వెళ్తానని పదే పదే మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.