ఈడీ విచారణకు కవిత… కేసీఆర్ ఏం చెప్పిపంపారంటే…?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఉత్కంఠ నడుమ ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దీంతో ఈసారి విచారణకు హాజరవుతారా అవరా అన్న ఉత్కంఠకు తెరపడింది. దీంతో మరోసారి హస్తిన కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అయితే… కవిత నిన్నటివరకూ తన హక్కుల విషయంలో సీరియస్ గా ఉన్నారు.. రాజీ పడేదే లేదన్నారు.. అవసరమైతే తన ఇంటికొచ్చి విచారణ చేసుకోమని ఈడీకి సూచించారు.. తనహక్కులపై కోర్టుకెళ్లారు.. కానీ.. ఉన్నపలంగా హక్కుల విషయాన్ని పక్కనపెట్టి… ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. దీంతో ఈలోపు ఏమి జరిగిందనే దానిపై చర్చలు సీరియస్ అయ్యాయి.

సుప్రీంకోర్టులో తన పిటిషన్ పై ఈ నెల 24న జరగనున్న విచారణ వరకు వేచి ఉండాలని, అప్పటివరకూ ఏదోరకంగా ఈడీ విచారణకు గైర్హాజరవ్వాలని కవిత తొలుత భావించారు! అనంతరం.. నేడు ఈడీ ముందు విచారణకు హాజరు కావాలా వద్దా.. అనే దానిపై లాయర్లతో కవిత సమావేశం అయ్యారు. నేడు విచారణకు హాజరు కాకపోతే.. విచారణకు సహకరించడం లేదని ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని కొంత మంది న్యాయ నిపుణులు చెప్పారంట. ఇదే క్రమంలో… ఈడీ విచారణకు వెళ్లాలని కవితకు సీఎం కేసీఆర్ కూడా సూచించినట్లు తెలుస్తోంది. అదేవిదంగా… మంచో చెడో ముందు విచారణకు వెళ్ళడమే మంచిది అ మంత్రి కేటీఆర్ కూడా సూచించినట్లు సమాచారం. దీంతో .. విచారణలో ఏ ప్రశ్నలు అడుగుతారు? సమాధానాలు ఏం చెప్పాలి? అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతర కవిత విచారణకు హాజరయ్యారని తెలుస్తుంది.

ఇదే క్రమంలో… నేటితో అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈడీ కస్టడీ ముగియనుంది. దీంతో… పిళ్ళై, మాగంటి శ్రీనివాసులు ని కవితతో కలిపి విచారించాలని స్పెషల్ కోర్టుకు గతంలో ఈడీ తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో… తనను బలవంతంపెట్టి, ఒత్తిడి చేసి, భయబ్రాంతులకు గురిచేసి విచారించారని.. ఫలితంగా తాను గతంలో ఇచ్చిన వాంగ్మూళాన్ని వెనక్కి తీసుకుంటున్నాని పిళ్లై కోర్టుకి వెల్లిన తరుణంలో… ఈసారి కవిత – మాంగంటి శ్రీనివాసుల సమక్షయంలో ఈడీ చేయబోయే కీలక విచారణపై ఆసక్తి నెలకొంది.

కాగా… ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసుల మేరకు మరోసారి కవిత ఆదివారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో భర్త అనిల్‌, సోదరుడు కేటీఆర్‌, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, పలువురు న్యాయవాదులతో కలిసి కవిత ఢిల్లీకి చేరుకున్నారు. నేరుగా తుగ్లక్‌ రోడ్డులోని తన తండ్రి, సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసంలో ఉన్నారు. ఉదయం ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు.