తెరాస అధినేత కేసీఆర్ కు ఎన్నిక ఏదైనా ముందు సర్వేలు చేయించుకోవడం అలవాటు. స్థానిక సంస్థల ఎన్నికల నుండి సార్వత్రిక ఎన్నికల వరకు సర్వేలను బాగా నమ్ముతారాయన. ఈ సర్వేలు చేయడానికి కేసీఆర్ వద్ద ప్రత్యేక బృందాలు ఉంటాయి. ఎన్నికలు వస్తున్నాయంగా రహస్యంగా వాటిని జనంలోకి వదులుతారు. పలు రకాలుగా సర్వేలు చేసి వాళ్ళు తీసుకొచ్చే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థి ఎంపిక, సంక్షేమ పథకాల ప్రకటనలు చేస్తుంటారు కేసీఆర్. ఇప్పుడంటే తగ్గింది కానీ గతంలో కేసీఆర్ ఒక వ్యక్తిని పోటీలో దింపడానికి ఎంపికచేశారు అంటే ఆటను గెలువపు గుర్రమనే నమ్మకం ఉండేది ప్రేక్షకుల్లో. ఆయన ప్రకటించే సంక్షేమ పథకాలు కూడ జనాల కోరికలకు, ఆశలకు దగ్గరగా ఉంటుంటాయి.
అయితే ఈ లెక్కలు గత మూడు ఎన్నికల్లో తప్పాయి.ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ అంచనాలను తలకిందులు చేస్తూ పసుపు రైతులు కేసీఆర్ కుమార్తె కవిత ఓటమికి కారణమయ్యారు. కేసీఆర్ కుమార్తె ఓడటంతో తెరాసకు బ్యాడ్ టైమ్ మొదలైంది. అప్పటి నుండి వరుస పరాజయాలు, పరాభవాలు, ప్రతికూల పరిస్థితులు ఎదిరవుతున్నాయి. దుబ్బాకలో సైతం మార్జిన్ ఓట్లతో అయినా గట్టెక్కవచ్చని సర్వేలు చెప్పగా ఫలితాల్లో తెరాస మట్టికరించింది. హైదరాబాద్ వరదలు, వ్యవసాయేతర కొత్త ఆస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియలు తెరాసను దెబ్బతీశాయి. ఫలితంగా గ్రేటర్ ఎన్నికల్లో 100 సీట్లు కొడతామన్న గులాబీ దళం 56 స్థానాలకే పరిమితంకావాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఫలితాలు చూసి జనం ఆలోచన సర్వేలకు అందలేదని అర్థమైంది. కేటీఆర్ చేసిన పాత అభ్యర్థులను రిపీట్ చేయాలనే ఆలోచన అట్టర్ ఫ్లాప్ అయింది.
అలాంటప్పుడు సర్వేలు, సర్కస్ కు అంటూ సొంత లెక్కలు వేసుకోకుండా జనం నాడిని కరెక్టుగా పట్టుకునే పనేదైనా చేస్తే బెటర్. త్వరలో నాగార్జున సాగర్ ఉపఎన్నికలు రానున్నాయి. వీటి కోసం కేసీఆర్ మళ్లీ సర్వేలనే నమ్ముకున్నారట. అసలు సాగర్లో సానుభూతి ఏమైనా పనిచేస్తుందా అనే అంశం మీద ఫలితాలు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. పైగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభ్యర్థి అయితే గెలవచ్చనేది కేసీఆర్ అభిప్రాయం. ఈమేరకు ప్రాజలేమని అనుకుంటున్నారో చూడాలనేది కేసీఆర్ ఉద్దేశ్యం. అందుకే బృందాలను దింపి సుఖేందర్ రెడ్డి బలాబలాలను గుర్తించే పనిలో ఉన్నారట. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ సర్వేల ఫలితాలు తలకిందులైనట్టు ఈసారి కూడ అయితే మాత్రం తెరాస నాగార్జున సాగర్లో నిమజ్జనం అయినట్టే.