చేస్తవా, చస్తవా చెప్పు మోడీ అని నిలదీసిన : కేసిఆర్

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తన ప్రసంగం గతంలో మాదిరిగా ఉరుములు మెరుపులు లేకుండా సాగింది. గతంలో కేసిఆర్ ప్రసంగాన్ని చెవులు రిక్కించి మరీ వినే వారు జనాలు. ఫిదా అయిపోయేవారు. ప్రగతి నివేదన సభలో మాత్రం గతంలో మాదిరిగా పంచ్ డైలాగులు పేలలేదు. సభా ప్రారంభంలో ఉమ్మడి రాష్ట్ర సిఎం చంద్రబాబును ఉద్దేశించి కొద్దిగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.. కానీ చంద్రబాబు పేరు తీసుకోకుండా జాగ్రత్తపడ్డారు.

సభలో జోనల్ వ్యవస్థ ఆమోదముద్ర అంశంపై కేసిఆర్ మాట్లాడుతూ జోనల్ వ్యవస్థ కు ఆమోద ముద్ర వేయకుండా మోడీ ఆలస్యం చేస్తుంటే నిలదీశానని అన్నారు. ‘‘చేస్తవా? చస్తవా’’ అని మోడీని నిలదీసిన అని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండకపోతే, కేసిఆర్ సిఎంగా లేకపోతే జోనల్ వ్యవస్థకు ఆమోదముద్ర పడేనా అని ప్రశ్నించారు.

ఇప్పుడు 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కుతాయన్నారు. గతంలో మాదిరిగా ఎక్కడివారో వచ్చి తన్నుకుపోయే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉందో జోనల్ వ్యవస్థకు ఆమోదముద్ర పడినప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని వెల్లడించారు.

సభలో కేసిఆర్ స్పీచ్ ముగింపు దశలో కాంగ్రెస్ నేతలను, జెఎసి నేతలను కూడా టార్గెట్ చేశారు. కానీ కాంగ్రెస్ పేరును కానీ, జెఎసి (జన సమితి పేరును) కానీ ఉచ్చరించలేదు. కేవలం కొన్ని ప్రతీప శక్తులు ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నాయి.. కేసులేస్తున్నాయని జెఎసిని ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పేరు చెప్పకుండానే ఢిల్లీ దొరల కింద గులాములుగా ఉందామా? ఢిల్లీ పాలకులకు గులాములుగా ఉంటే తెలంగాణకు మేలు జరుగుతుందా? అని నిలదీశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఢిల్లీ దొరల వైపు చూద్దామా? అంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.

మూకలు, ప్రతీప శక్తులు, ప్రగతి నిరోధక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొంత మంది నాయకులు కేసిఆర్ ను గద్దె దింపడమే లక్ష్యం అంటున్నారు. ఇదేం లక్స్యం రా బాబూ అని నేను అన్నారు. ప్రగతి నిరోధక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేను చెబుతున్నాను.

‘‘ప్రగతి సభలో కేసిఆర్ హామీల వర్షం కురిపిస్తాడని పత్రికల్లో రాశారు. ముందస్తు ఎన్నికల గురించి రాశారు. కానీ నేను అలా చెప్పను. పెద్దలు కేశవరావు నాయకత్వంలో మేనిఫెస్టో కమిటీ పనిచేస్తది. ప్రజలు మళ్లీ దీవిస్తే కోటి ఎకరాల ఆకు పచ్చని మాగాణి, అద్భుతమైన రీతిలో ఐటి లాంటి పరిశ్రమల ఏర్పాటు యువతకు ఉద్యోగాలు ఇస్తానని మనవి చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.