KCR: ప్రజలలోకి రానున్న గులాబీ బాస్… క్లారిటీ ఇచ్చిన కేటీఆర్?

KCR: ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలను తీసుకున్నారు. ఈయన ఏకంగా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణని పరిపాలించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలు కావటం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా ఏడాది పూర్తి చేసుకుంది.

ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఎక్కడ బయట కనిపించలేదు కనీసం అసెంబ్లీలోకి కూడా ఈయన అడుగుపెట్టడం లేదు. దీంతో ఒక్కసారైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో మాట్లాడాలని ఆయనని అడగాల్సినవన్నీ అడగాలని ఎంతోమంది కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ముచ్చట పడుతున్నారు కానీ వారి ముచ్చట మాత్రం కేసిఆర్ తీర్చడం లేదు.

ఈ క్రమంలోనే బిఆర్ఎస్ శ్రేణులు సైతం తమ నాయకుడు ఎప్పుడు బయటకు వస్తారు ఆయన ఏడాది కాంగ్రెస్ పాలనపై ఎలాంటి స్పందన తెలియచేస్తారనే అంశంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి కేటీఆర్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ గారు గత 25 సంవత్సరాలుగా తెలంగాణ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేపట్టారు అనంతరం 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇలా గత పాతిక సంవత్సరాలుగా ఎంతో కష్టపడిన ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. ఇలా కెసిఆర్ గురించి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఆయన ఇప్పుడు అప్పుడే బయటకి రారని తెలుస్తోంది. అదేవిధంగా 2025లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని, 2025 సంవత్సరంలో (BRS) బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.