విప్లవకారులు, నక్సలైట్లు సాయుధ పోరాటాన్ని వీడి 2019 ఎన్నికల్లొ పాల్గొనాలని సామాజిక వేత్త కంచ ఐలయ్య పిలుపునిచ్చారు. టిమాస్ ఆధ్వర్యంలో మెదక్ లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై గద్దర్, కేటిఆర్ పై విమలక్క పోటి చేస్తారని తెలిపారు. గద్దర్ పాటలతోనే కేసీఆర్ గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించి గెలిచారన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పారని ఆయన మండి పడ్డారు. కేసీఆర్ కు సరైన గుణపాఠం చెప్పేందుకు వచ్చే ఎన్నికల్లో గద్దర్ ను దింపుతామన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ ప్రజా సామాజిక సంఘాల ఐక్య వేదిక టిమాస్ కూడా రాష్ట్రంలో ప్రధాన పక్షాలతో పాటు సిద్దమవుతోందని అన్నారు. సామాజిక మార్పు అన్నది ఎన్నికల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బహుజనులకే ఓట్లు వేయాలని రెడ్డి, వెలమ అభ్యర్ధులకు ఓట్లు వేయవద్దని ఆయన కోరారు.