Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ విచారణ.. కేసీఆర్ ఊహించని నిర్ణయం!

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొత్త మలుపు తిరిగేలా ఉంది. గతంలో విచారణలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఈసారి స్వయంగా హాజరయ్యేలా నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రిటైర్డ్ ఇంజినీర్లతో సమావేశాలు, న్యాయ సలహాదారులతో చర్చలు జరిపిన ఆయన, జూన్ 5న కమిషన్ ముందు హాజరయ్యే ఆలోచనలో ఉన్నారు.

ఇప్పటికే మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ లకు నోటీసులు జారీచేసిన కమిషన్, మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా అదే విధంగా విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించింది. హరీశ్ రావు జూన్ 9న హాజరవుతున్నట్లు ప్రకటించగా, ఈటల స్పందన తెలియాల్సి ఉంది. అయితే కేసీఆర్ ఈసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా కమిషన్‌కు సహకరించాలని భావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎర్రవల్లి ఫాం హౌస్‌లో హరీశ్ రావు, కేటీఆర్‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపిన కేసీఆర్, విచారణకు ముందు పూర్తి సమగ్రతతో సిద్ధమవుతున్నారు.

బ్యారేజీల నిర్మాణంలో తలెత్తిన లోపాలు, విజిలెన్స్ నివేదికలు, ఎన్‌డీఎస్‌ఏ అభిప్రాయాలు, నిర్మాణ సంస్థల జవాబులు వంటి అంశాలపై ఇప్పటికే కేసీఆర్ వర్గీయులు పరిశీలన ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల సమాచారం సైతం సేకరించారని చెబుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పుడు కేంద్రం, రాష్ట్రం, న్యాయ వ్యవస్థల దృష్టి నిలవడంతో.. కేసీఆర్ హాజరు ఈ విచారణలో టర్నింగ్ పాయింట్ అవుతుందా అనే ప్రశ్నతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.

మహానాడు కుట్ర || Journalist Bharadwaj EXPOSED Mahanadu Kadapa Meeting || Chandrababu || Lokesh || TR