తెలంగాణలో రాజకీయాలను దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నిక ఒక్కసారిగా మార్చేసింది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఉన్న ఆదరణ ముందు కాంగ్రెస్ నాయకులు ఉన్న సంగతి కూడా ప్రజలు మర్చిపోయారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న బీజేపీ యొక్క ఆదరణను చూసి ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు కూడా భయపడుతున్నారు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రంలో బీజేపీ యొక్క ఆదరణను చూసి భయపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆ భయంతోనే రానున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు కేసీఆర్ రంగంలోకి దిగనున్నారని సమాచారం.
కేసీఆర్ రంగంలోకి దిగనున్నారా!!
దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ అటువైపు కూడా వెళ్ళలేదు. ఆ ఎన్నిక వ్యవహారం మొత్తం హరీష్ రావుకు వదిలేశారు. ఆ ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది. అలాగే హైద్రాబాద్ గ్రేటర్ ఎన్నికలో కూడా కేసీఆర్ దూరంగానే ఉన్నారు. ఆ వ్యవహారం మొట్ట కేటీఆర్ చూసుకున్నారు. కానీ బీజేపీ తాకిడికి అడ్డుకోలేకపోయారు. ఇలా ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్ కు బీజేపీ షాక్ ఇస్తుండటంతో నాగార్జున సాగర్ లో జరగనున్న ఉప ఎన్నిక కోసం నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నారని సమాచారం. ఈ ఎన్నికలో కూడా బీజేపీ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి. ఈ సంకేతాలు వెళ్లకుండా అడ్డుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు ఉంది.
బీజేపీ మళ్ళీ షాక్ ఇవ్వనుందా!!
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఇచ్చిన ఆదరణను చూసి బీజేపీ నాయకులే ఆశ్చర్యపడ్డారు. దుబ్బాకలో కాంగ్రెస్ ను కాదని బీజేపీ ప్రజలు అక్కున చేర్చుకుంటారని ఎవ్వరు ఊహించలేదు. అలాగే గ్రేటర్ ఎన్నికలో కూడా ప్రజలు బీజేపీని నెత్తిన పెట్టుకున్నారు. దింతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులకు నమ్మకం కలిగింది. అలాగే ఇప్పుడు సాగర్ ఎన్నికలో కూడా గెలవడానికి కూడా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అక్కడ బలంగా ఉన్న నాయకులను పార్టీలోకి తీసుకోవడానికి బీజేపీ నాయకులు ప్రయత్నితున్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. సాగర్ ఎన్నికలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.