CM KCR: కేసీయార్‌ని లైట్ తీసుకున్న మునుగోడు ఓటర్లు.?

CM KCR:  మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఎలా వుండబోతోందన్నదానిపై చాలా ఎగ్జిట్ పోల్ అంచనాలొచ్చాయి. దాదాపు అన్నిట్లోనూ తెలంగాణ రాష్ట్ర సమతికి అనుకూలంగానే ఫలితం వుంటుందని తేలింది. ‘మేమే గెలుస్తాం..’ అని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేయడాన్ని చూశాం.

ఫలితాలు వెల్లడయ్యే రోజు రానే వచ్చింది. కౌంటింగ్ షురూ అయ్యింది. మొదటి రౌండ్ టీఆర్ఎస్ ఆధిక్యంలో వుంటే, రెండో రౌండ్ అలాగే మూడో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం దక్కించుకుంది. మొత్తంగా 15 రౌండ్లతో అసలు ఫలితం తేలుతుంది మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి.

అంతా ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ మునుగోడు రేసులో పెద్దగా కనిపించడంలేదు. ఫలితం ఎలా వుంటుంది.? అన్నది వేరే చర్చ. కేసీయార్‌ని మునుగోడు ప్రజలు పక్కన పెట్టేశారన్న వాదన బలంగా తెరపైకి వస్తోంది. ‘బీజేపీకి డిపాజిట్లు వస్తే నన్ను పక్కన పెట్టేస్తారు..’ అంట మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీయార్ చేసిన వ్యాఖ్యలు, ఓటర్లపై గట్టిగానే ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.

అయితే, ఆ ప్రభావం వేరే యాంగిల్‌లో చూపించింది. అదే అసలు సమస్య. బీజేపీకి మునుగోడులో డిపాజిట్ వస్తే, కేసీయార్‌ని పక్కనపెట్టేసినట్లే.. అన్న కేసీయార్ వాదనే నిజమైతే, మునుగోడు ప్రజలే కేసీయార్‌ని పక్కన పెట్టేశారనుకోవాలి.. ఎందుకంటే, డిపాజిట్ రావడం మాత్రమే కాదు.. కొన్ని రౌండ్లలలో టీఆర్ఎస్‌కి బీజేపీ షాక్ ఇస్తోంది కూడా.

అంతిమ ఫలితం బీజేపీ వైపు వుంటే.. ఇక, మునుగోడు ఉప ఎన్నిక దెబ్బకి తెలంగాణలో టీఆర్ఎస్ ఖేల్ ఖతం అయిపోయినట్లవుతుంది. మునుగోడు ఉప ఎన్నిక విషయమై బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ వ్యూహాన్ని దెబ్బ కొట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయినట్లే కనిపిస్తోంది.