టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధుకు హైకోర్టు షాక్

అధికార పార్టీ టిఆర్ ఎస్ మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకు హైకోర్టు షాకిచ్చింది. తన కుమారుని వివాహ రిసెప్షన్ కోసం కళాశాలలోని భవనాలను కూల్చేశారని పుట్ట మధుపై పిటిషన్ దాఖలైంది. పూర్తి వివరాలేంటంటే…

పిటిషనర్ ఇనుముల సతీష్

పుట్ట మధు మంథని ఎమ్మెల్యే. 26-08-2018 న తన కుమారుని రిసెప్షన్ జరపడానికి మంథని గవర్నమెంట్ కళాశాల ప్రాంగణంలో గల సుమారు 2 కోట్ల విలువ చేసే కళాశాల ల్యాబోరేటరి భవనాలను ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అక్రమంగా కూల్చి వేశారని మంధని మాజీ ఉప సర్పంచ్, కళాశాల పూర్వ విద్యార్ధి ఇనుముల సతీష్ హైకోర్టులో 16 వతేదినాడు పిటిషన్ వేశారు.

కలెక్టర్, ఇంటర్ బోర్డు, ఆర్జేడి, ప్రిన్సిపల్ లకు లేఖలు ఇచ్చినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సతీష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.  ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం తెలంగాణ న్యాయవాదిని అడిగి తెలుసుకోవాలని దీనిపై  ఈ నెల 28న విచారిస్తామని కోర్టు తెలిపింది.

దీనిపై మంగళవారం నాడు విచారిచింన కోర్టు ప్రభుత్వ కళాశాల ఆవరణలో కూల్చివేసిన ఘటనలో మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకు, మంథని మున్సిపల్ కమిషనర్ కు నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది.