Y.S Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి మెడకు సింగయ్య మృతి ఉచ్చుల బిగుస్తోందని చెప్పాలి. వైసిపి కార్యకర్త మరణిస్తే ఆయన కుటుంబానికి పరామర్శించడానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మరో వ్యక్తి బలి కావడంతో జగన్మోహన్ రెడ్డి పై కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా ఈయన ప్రయాణం చేసిన బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో కారు నడిపిన డ్రైవర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి అలాగే కారులో ఉన్న కొంతమందిపై కూడా కేసులు నమోదు కావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేస్ కొట్టి వేయాలి అంటే కోర్టును ఆశ్రయించారు.
జగన్ దాఖలు సుదీర్ఘ పిటిషన్(12 పేజీలు)లో ఆయన చేసిన వాదన.. ఆశ్చర్యంగా ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. ఈ పిటిషన్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ తాను ప్రయాణించిన కారు బరువు సుమారు 4 వేల కిలోలు ఉంటుంది.ఇంత బరువుతో ఉన్న వాహనం సింగయ్యపై ఎక్కితే, ఆయన తలకు చిన్నపాటి గాయాలే ఎందుకు అయ్యాయి? ఇది నిస్సందేహంగా నాపై మోపిన కుట్ర పూరిత కేసు అని తెలిపారు.
ఎస్పీ సతీష్‌కుమార్ ముందు అసలు తమ వాహనం కానీ.. తమ కాన్వాయ్ కానీ.. ఈ కేసులో లేవని చెప్పారు. నాలుగు రోజుల తర్వాత.. తామే తొక్కి చంపామని చెబుతున్నారు. ఆయనను విచారించాలి. ఇంతగా మాట మార్చేయడంపై మాకు అనుమానాలు ఉన్నాయనీ పేర్కొన్నారు. ఇకపోతే తాను గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాను.పైగా ఒక పార్టీకి అధ్యక్షుడిని. సమాజంలో గౌరవంగా ప్రతిష్టాత్మకంగా జీవిస్తున్నా. ఇప్పుడు నన్ను అరెస్టు చేస్తే.. నా ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది. నన్ను అరెస్టు చేయడాన్ని మా పార్టీ కార్యకర్తలు ఏమాత్రం జీర్ణించుకోలేరు అందుకే ఈ కేసు కొట్టి వేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఈయన చేసిన వ్యాఖ్యలపై తీర్థ స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని ఇలా పరువు ప్రతిష్టల గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.