హరికృష్ణ ఆఖరి క్షణాల్లో… అన్నీ తానైన టిఆర్‌ఎస్ నేత (వీడియోలు)

నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉదయం 6.30 నిమిషాలకు అన్నెపర్తి వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. స్థానికులు హరికృష్ణను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపు పోలీసు అదికారుల ద్వారా ప్రమాదం విషయం తెలుసుకున్న నల్లగొండ టిఆర్ ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే హరికృష్ణను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసి నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో హరికృష్ణ చికిత్స విషయంలో దగ్గరుండి ఎప్పటికప్పుడు కంచర్ల భూపాల్ రెడ్డి పర్యవేక్షించారు.

 ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లను తీసుకోస్తూ

హరికృష్ణ చనిపోయిన వార్తను డాక్టర్లు కంచర్ల భూపాల్ రెడ్డికి చెప్పగానే తన మిత్రుడు అయిన సినీ హీరో నందమూరి బాలకృష్ణకు విషయం చెప్పారు. టిడిపి నేతలకు కూడా ఫోన్ చేసి భూపాల్ రెడ్డి విషయం చెప్పారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఆసుపత్రికి చేరుకోగానే వారిని దగ్గరుండి హరికృష్ణ దగ్గరకు తీసుకెళ్లారు. వారిని ఓదార్చారు. చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, జగదీష్ రెడ్డిలు ఆస్పత్రికి చేరుకోగానే వారికి ప్రమాదం జరిగిన తీరును వివరించారు. ఎప్పటికప్పుడు అధికారులతో,  నాయకులతో కో ఆర్డినేట్ చేస్తూ భూపాల్ రెడ్డి నందమూరి కుటుంబానికి సహకరించారు.

బాలకృష్ణను తీసుకొస్తున్న కంచర్ల భూపాల్ రెడ్డి

భూపాల్ రెడ్డి  నిజాం కళాశాలలో చదువుతున్నప్పుడు హరికృష్ణ యువసేనలో కీలకంగా పనిచేశారు. హరికృష్ణతో చాలా సన్నిహిత సంబంధం భూపాల్ రెడ్డికి ఉంది. నందమూరి కుటుంబంతో కూడా భూపాల్ రెడ్డి కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. టిడిపిలో మంచి నాయకుడిగా ఉన్నా తన రాజకీయ భవిష్యత్ కోసం టిఆర్ ఎస్ లో చేరారు. నందమూరి కుటుంబంతో ఉన్న అనుబంధంతో వెంటనే భూపాల్ రెడ్డి  సహకరించి హరికృష్ణ చికిత్స విషయంలో శాయశక్తులా కృషి చేశారని కార్యకర్తలు అన్నారు.

హరికృష్ణ మృతదేహం వద్ద కంచర్ల భూపాల్ రెడ్డి

హరికృష్ణ మృతదేహం వద్ద విషాద వదనంలో కంచర్ల భూపాల్ రెడ్డి

మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా ప్రమాద విషయం తెలియగానే ఆస్పత్రికి చేరుకున్నారు. భాస్కర్ రావు కు కూడా ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధాలు, హరికృష్ణతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. కంచర్ల భూపాల్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. 

హరికృష్ణ మృతదేహం వద్ద నివాళి అర్పిస్తున్న లోకేష్