పది రోజుల్లో పిసిసికి కొత్త కమిటీలు
ఎన్నికల కోసం ఐదు కమిటీలు
ఎఐసిసి ఆదేశాలు జారీ
యుద్ద ప్రాతిపదికన కమిటీల నియామకం
ఐదుగురితో ఎన్నిలక మేనేజ్‌మెంట్ టీమ్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ కొత్త కమిటీలతో సిద్దం అవుతోంది. 3వ తేదీన డిల్లీలో జరిగిన ఎఐసిసి కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జ్‌ల సమావేశంలో ఎఐసిసి తీసుకున్న నిర్ణయాలను ఆర్గనైజేషన్ కమిటీ అన్ని పిసిసిలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా అన్ని పిసిసి కమిటీలను తిరిగి నియమించాలని, వాటితోపాటు ఎన్నికల కోసం కొత్తగా ఐదు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఇచ్చిన ఆదేశాలతో కాంగ్రెస్‌లో తిగిరి ఎన్నికల కమిటీల నియామకం తప్పనిసరి అయింది. అలాగే సంస్థాగతంగా కమిటీల నియామకం చేయనుండడంతో కాంగ్రెస్ లో నాయకులు మళ్ళీ పదవుల కోసం పరుగులు తప్పనిసరి అయ్యేలా ఉంది.
ఎఐసిసి ఆర్గనైజేషన్ కార్యదర్శి జెడి శీలం పిసిసిలకు పంపిన లేఖల ప్రకారం టైమ్ షెడ్యుల్ ప్రకారం కమిటీలను పూర్తి చేసి ఎఐసిసికి నివేధిక ఇవ్వాలని ఉంది. ప్రదానంగా జనవరి 8వ తేదీలోగా ఎన్నికల కోసం పిసిసి స్థాయిలో 5 కమిటీలను ఏర్పాటు చేయాలి. అందులో కో ఆర్డినేషన్ కమిటీ, ప్రదేశ్ ఎన్నికల కమిటీ, ప్రచార (కాంపెయిన్) కమిటీ, పబ్లిసిటీ కమిటీ మరియు మీడియా కో ఆర్డినేషన్ కమిటీ నియమించి ఈ కమిటీలు 15వ తేదీ నుంచి కమిటీలు పనులు ప్రారంబించాలని ఆదేశించింది.
అలాగే ప్రధానంగా సంస్థాగతంగా పిసిసి, డిసిసి, సిటీ కమిటీలు, బ్లాక్ మరియు వార్డు కమిటీలను జనవరి 15వ తేదీ లోగా నియమించాలని, బూత్ కమిటీలు అన్ని జనవరి 30వ వరకు పూర్తి చేయాలని, ఫిబ్రవరి నెలాఖరు నాటికి కొత్తగా నియామకమైన బూత్, బ్లాక్, అసెంబ్లీ స్థాయి కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని ఎఐసిసి ఆదేశించింది. కొత్తగా బూత్ లెవల్ నుంచి పిసిసి లెవల్ కమిటీల నియామకానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్నిపూర్తి వివరాలను పార్మెట్ రూపంలో ఫిబ్రవరి 5వ తేదీలోగా ఎఐసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శికి సమర్పించాలని ఆదేశించింది. అలాగే ఎన్నికల సంఘం సవరించిన ఓటర్ల లీస్టు జాబితా విషయంలో పార్టీ లోతుగా పరిశీలించాలని, మార్పు చేర్పులు చేసేందుకు బూత్ లెవల్ ఎజెంట్లను నియమించి ఆ జాబితాను జనవరి 25వ తేదీలోగా ఎన్నికల సంఘం సమర్పించాలని ఆదేశించారు.
అలాగే ఎన్నికలు సమీపిస్తుండడంతో పిసిసి కమిటీలలో ఉన్న కార్య నిర్వాహక అధ్యక్షుకులకు, ఉపాధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులుగా, కార్యదర్శులకు ప్రత్యేకంగా పని విభజన చేసి బాధ్యతలు అప్పగించాలని, అలాగే ప్రతి పిసిసి కమిటీలో ఐదుగురితో ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ఎన్నికలకు సంబంధించి డిసిసిలతో,ఎఐసిసిలతో పనుల బాధ్యతలను నిర్వహించేలా చూడాలని ఎఐసిసి ఆదేశించింది. అలాగే పార్లమెంట్ అభ్యర్థులు ఎంపికకు సంబంధించి ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశాలు, డిసిసిల నుంచి సిఫారసులు తదితర కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే ఈ నెల 15న పిసిసి స్థాయిలో ముఖ్య నాయకులతో సమావేశాలు పెట్టి భవిష్యత్తు కార్యచరణ అమలు చేయాలని, శక్తి ఆప్ కు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కో ఆర్డినేటర్ల నియామకం. తదితర ప్రధాన పనులు జనవరి 30వ తేదీలోగా పూర్తి చేసి ఎన్నికలకు సిద్దం కావాలని ఎఐసిసి ఆదేశాలు ఇచ్చింది.
అలాగే సంస్థాగత కమిటీలకు సంబంధించిన పనులను పూర్తి చేయడం, లోక్ సభ ఎన్నిలకు సంబంధించి ప్రణాళికను సిద్దం చేయడం, పిసిసి అధ్యక్షుడికి సంబంధించిన పనులలో కమిటీలు సంపర్ణ మద్దతు ఇవ్వడం, అలాగే ప్రచార ప్రణాళికలను, మ్యానిఫెస్టో అంశాలకు సంబంధించిన సలహాలు, సూచనలను కూడా అనుబంధ విభాగాలు, కమిటీలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఇది ఎలాంటి జాప్యం లేకుండా, నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీగా, ప్రణాళిక బద్దంగా చేపట్టాలని ఎఐసిసి పిసిసిలను ఆదేశించింది.