పాపం, మోత్కు పల్లి నరసింహులు పరిస్థితి చూడండి…

ఇపుడు తెలంగాణాలో ఎవరికీ పట్టని మనిషి మోత్కుపల్లి నరసింహులు.  రాష్ట్రంలో బాగా  మాట్లాడే వాళ్లలోమోత్కుపల్లి నరసింహులు ఒకరు. తెలుగుదేశం పార్టీ ఈయన నోరు, భాషని ఒకపుడు బాగా వుపయోగించుకుంది. అపుడు ఆయన టిఆర్ ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుని పెద్ద పెద్ద మాటలతో తిట్టేవాడు. తిట్టుడుకు కూడా బేస్ ఉండేది. అంతా బేష్ అన్నారు. అయతే ఆయనిపుడు ఏ పార్టీకి అవసరంలేని నాయకుడయ్యాడు.టిడిపి లేదు. టిఆర్ఎస్ నుంచి పిలుపు లేదు.  కాంగ్రెస్ ఖాతరు చేయం లేదు.బిజెపి రాయబారం పంపలేదు. ఎందుకిలా అయింది?

ఆ రోజుల్లో  తెలంగాణలో టిడిపి టిడిపికి బలమయిన నాయకుడు, చంద్రబాబుకు తెలంగాణలో కొండంత అనుకున్నారు. కాని ఏమయిందో ఏమో ఆయన టిడిపిలో కెసిఆర్ కోవర్ట్ లాగా మాట్లాడటం మొదలుపెట్టారు. అదే కొంపముంచింది. తెలుగుదేశం పార్టీని టిఆర్ ఎస్ లో విలీనంచేయాలనే దాకా వెళ్లారు. చివరకు టిడిపి ఆయనను వదిలించుకుంది.

అదే సమయంలోనే ఆయన పోరాటాన్ని  కెసిఆర్ కుటుంబం మీదకు మళ్లించారు. యాదాద్రిని జిల్లా చేయకుండా మరోజిల్లాలో కలిపేయాలని, ఇదంతా తన అలేరు నియోజకవర్గాన్ని వేరే జిల్లాలో కలిపేందుకు కుట్ర అన్ని అనారు. మొత్తానికి కెసిఆర్ ను  ఒప్పించి యాదాద్రి జిల్లా ను తెచ్చింది తనే అంటున్నారు.

 కేసిఆర్ మెప్పు సంపాదించేందుు ఆయన  పేరు చాలా చాలా  ఎక్కువగా వాడి తెలుగుదేశం పార్టీని  వదులుకున్నారు. అయితే, ఆయనకు టిఆర్ ఎస్ నుంచి ప్రశంసలు లేవు. మద్దతు లేదు. పార్టీ లో చేరండని పిలుపేం రాలేదు. టిఆర్ ఎస్ ఆయన్ని సీరియస్ గా తీసుకోనే లేదు. అదే విధంగా మా పార్టీలో చేరండి, మా కూటమిలోకి రండి, ఆయన్ని ఎవరూ ఆహ్వానిస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. చివరకు ఆయన ఒంటిరి అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంటుగా పోటీ చేయాల్సివస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన గురువారం నాడు యాదగిరి గుట్టలో తన ఉనికిని చాటులకునేందుకు ‘శంఖారావం’ ఎన్నికల సభ నిర్వహించారు. సభలో భార్య డాక్టర్‌ యశోద తో  పాటు కూతురు, అల్లుడు, మనమడు కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో అందరి ముందు ఇంత పెద్ద నాయకుడయిన ఆయన చేసందేమిటి? ప్లీజ్ , కెసిఆర్  గారూ , నా వైపు చూడండి, నన్నూవాడుకోండి… అని ముఖ్యమంత్రి కెసిఆర్ ను   దాదాపు బతిమాలుకున్నారు.

‘నన్ను పార్టీలోకి తీసుకోండి, నేను మీకు బాగా పనికొస్తా. ఎక్కువ సీట్లు గెలిపిస్తా’నని చాలా ప్రాధేయపడ్డారు. రుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయి, ఒక పద్ద పార్టీకి కొండంత అండగా నిలచిన నాయకుడి పరిస్థితి ఇది. ఆలేరు నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేసి గెలిచ్చి అక్కడి ప్రజలకు గోదావరి జలాలు, రిజర్వాయర్ల సాధిస్తానని ప్రకటించారు. చంద్రబాబు వంటి మోసకారిని నమ్ముకుని నష్టపోయి నడిరోడ్డున నిలబడ్డానని ఆవేదన చెందారు. మళ్లీ ఇపుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్ర బాబును తరి మేయాలంటే తనలాంటి వాడు కెసిఆర్ కు అవసరమనే రీతీలో ఆయన కెసిఆర్ కు విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు మంచి మిత్రుడని చెప్పారు. ఈ ఎన్నికల్లో తనను ఉపయోగించుకుంటే టిఆర్ ఎస్ చాలా ప్రయోజనం ఉంటుందని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12సీట్లు గెలిపించి కెసిఆర్ చేతిలో పెడుతాననిఅన్నారు. తెలుగుదేశం లో తనకు వచ్చిన కష్టాట గురించి చెబుతూ తాను కేసీఆర్‌ కోసమే తాను టిడిపిలో వాదించాలనని ప్రజాస్వామికంగా ఎన్నికైన కెసిఆర్  ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేయవద్దని చెప్పానని అన్నారు.

 ఆరోజుల్లో టిఆర్ ఎస్ ని  రాజకీయంగానే  వ్యతిరేకించానే తప్ప తాను చంద్రశేఖర్ రావుకు ఎపుడూ  వ్యతిరేకం కాదని అన్నారు.

మరి కెసిఆర్ ఈ మాటలు వింటారు, విని నమ్మి మోత్కుపల్లిని కటాక్షిస్తారా?