ఆ కుటుంబాన్ని అదృష్టం వరించింది. కొడుకు ఎమ్మెల్యే అయితే తండ్రి ఏకగ్రీవ సర్పంచ్ అయ్యిండు. దేవరకొండ ఎమ్మెల్యేగా రవీంద్రనాయక్ టిఆర్ ఎస్ నుంచి గెలుపొందారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో రవీంద్రనాయక్ తండ్రి కన్నీలాల్ ను రత్యతండా సర్పంచ్ గా గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొడుకు ఎమ్మెల్యే, తండ్రి సర్పంచ్ కావడంతో ఆ తండా వాసులంతా ఆనందంలో మునిగిపోయారు. తండాలో పండగ వాతావరణం నెలకొంది.