టిఆర్ఎస్ మహిళా నేత దుశ్చర్యతో అమ్మాయి ఆత్మహత్య

ఆమె అధికార టిఆర్ఎస్ పార్టీ నేత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నామినేటేడ్ పోస్టులో ఉంది. ఆమే లలితా ముదిరాజ్. తన కొడుకు తప్పుదారి పడుతుంటే సరిదిద్దాల్సింది పోయి అతని వక్రబుద్దికి వత్తాసు పలికింది. దీనిని అవమానంగా భావించిన ఆ అమ్మాయి తనువు చాలించింది.

నారాయణ పేట జిల్లా మాగనూరుకు చెందిన సౌందర్య డిగ్రీ చదువుతోంది. సీవి రామన్ డిగ్రీ కాలేజిలో లెక్చరర్ గా శ్రీకాంత్ పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా ప్రేమించాలంటూ శ్రీకాంత్ సౌందర్య వెంట పడుతున్నాడు. సౌందర్య శ్రీకాంత్ వేధింపులను ఇంట్లో చెప్పగా వారు సౌందర్యను కాలేజి బంద్ చేయించారు.

దీంతో విషయం తెలుసుకున్న శ్రీకాంత్ తల్లి లలితా ఏకంగా సౌందర్య ఇంటికెళ్లి తన కొడుకుకు మీ కూతురును ఇచ్చి పెళ్లి చేయాలని రచ్చ రచ్చ చేసింది. దీంతో సౌందర్య తండ్రి స్థానిక నాయకుల సహాకారంతో లలితను అక్కడి నుంచి పంపించేశాడు. లలిత ఇంటికి వచ్చి ఆందోళన చేయడంతో దానిని ఊళ్లో అవమానంగా భావించిన సౌందర్య… తల్లిదండ్రులు బయట ఉండగా ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయింది.

దీంతో అప్పటి వరకు తమతో ఉన్న బిడ్డ క్షణాల్లోనే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళా నేత పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.