కేసీఆర్ పాక్షిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో కమిటికి 300 పైగా విజ్ఞాపన పత్రాలు వచ్చాయన్నారు. భవిష్యత్తును ఆలోచించి నిర్ణయం తీసుకున్నామన్నారు. గత నాలుగేళ్ల పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మ్యానిఫెస్టో తయారు చేశామన్నారు. మాట ఇస్తే దానిని ఖచ్చితంగా చేసి తీరాలి. ఎన్నికలు కొందరికి ఆట మాత్రమే కానీ టిఆర్ ఎస్ కు అదొక పెద్ద టాస్క్ అన్నారు. కేసీఆర్ ప్రకటించిన వరాల జల్లు వివరాలు కింద ఉన్నాయి.
మరో రెండేళ్లలో తెలంగాణకు కోటి ఎకరాలకు నీరు
రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, లక్ష లోపు రుణాలు కలిగిన రైతులు 45.5 లక్షల మంది.
రైతుబంధు స్కీంకు ఇప్పుడుస్తున్న 4 వేలను పెంచి ఎకరానికి 5 వేల చొప్పున సంవత్సరానికి 10 వేల రూపాయలు
57 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్, పెన్షన్ 1000 రూపాయల నుంచి 2116 కు పెంపు
57 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి1000 రూపాయల నుంచి 2016 రూపాయలు
వికలాంగుల పెన్షన్ 1500 రూపాయల నుంచి 3016 రూపాయలు
నిరుద్యోగులకు భృతి, నెలకు నిరుద్యోగ భృతి 3016 రూపాయలు
మార్కెట్ ఇంటర్వెన్షన్ కొరకు రూ.2 వేల కోట్లు
రైతు సమన్వయ సమితిలకు గౌరవ వేతనాలు
2 లక్షల 60 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల లక్ష్యం
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాల రూపకల్పన
అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఆశించిన రీతిలో మధ్యంతర భృతి
రెడ్డి, వైశ్య కులాలకు కార్పోరేషన్లు
సొంత స్థలాలు ఉన్న వారందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు
అగ్ర వర్ణాల పేదలకు ప్రత్యేక కార్యక్రమాలు
గతంలోనే ఇవ్వని హామీలను కూడా చేసి చూపించిన ఘనత టిఆర్ ఎస్ ది అన్నారు. ఒక పథకాన్ని ఆలోచించాలంటే దానికి ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది. కేంద్రం నాలుగున్నరేళ్లలో పెద్దగా సహాయం చేయలేదన్నారు. అయినా కూడా విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపామన్నారు. మిషన్ కాకతీయ, భగీరథకు కేంద్రం రూపాయి ఇవ్వలేదన్నారు.
కేంద్రం సహకారం లేకుండా వచ్చే 5 ఏళ్లలో తెలంగాణకు 10 లక్షల 37 వేల కోట్ల రూపాయలు సమకూరుతాయన్నారు. 2 లక్షల 70 వేల కోట్ల అప్పులు చెల్లించాలన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే మ్యానిఫెస్టో తయారు చేశామన్నారు. గతంలో ప్రారంభించిన పథకాలన్నీ విజయవంతమయ్యాయన్నారు. అత్యంత మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ప్రాధాన్యత నిచ్చామన్నారు. తెలంగాణలో రైతును రాజు చేస్తామని కేసీఆర్ అన్నారు.