తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నకూతురు రేగుల పాటి రమ్యారావుకు “తెలుగుదేశం” తలుపులు తెరుచుకోవడం లేదు.
ఆమెనుతెలుగుదేశంలో చేర్చుకోరాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు రణమకు తెలియచేశారు.
రమ్యారావు తెలుగుదేశం పార్టీలో చేరేందుు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఆమె గత వారం అమరావతి వెళ్లి చంద్రబాబు నాయుడిని కలిశారు. తాను టిడిపిలో చేరి తెలంగాణ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు కూడా ఆమె చెప్పారు. దీనితో ఆమె ను పార్టీలో చేర్చుకుని ఒక కీలకమయిన స్థానంనుంచి పోటీ చేయిం చి టిఆర్ ఎస్ ను ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తారని వూహాగానాలు వినిపించాయి.
రమ్యారావు ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. ఆమె పార్టీ అధికార ప్రతినిధి కూడా.వేముల వాడనుంచి ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే, ఆమెకు పార్టీ టికెట్ దొరికే అవకాశం కనిపించడం లేదు. దానికి తోడు తనకు పార్టీలో తగినంత మద్దతు లభించడం లేదని కూడా ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి వెళ్లి ఉండవళ్లి నివాసంలో ఆమె చంద్రబాబు ను కలిశారు.
ఆమె ను పార్టీలో చేర్చుకునే విషయం టిడిపి నేత టిటిడిపి నేతలతో జరిపిన సమావేశంలో చర్చకు వచ్చింది. అంతా అనుకున్నట్లు ఆమెను పార్టీలో చేర్చుకోవడం లేదు. సమావేశంలో ఈమేరకు నిర్ణయం జరిగింది. రమ్యారావు మీద వ్యతిరేకతో కాకుండా, ఆమెను చేర్చకోవడం వల్ల తెలంగాణలో టిడిపికి కొత్త సమస్యవస్తుందని అందువల్ల ఆమెనుటిడిపిలో చేర్చుకొనకోవడమే మేలని చంద్రబాబు సూచించారు.
ఆమెను టిడిపిలో చేర్చుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త ప్రచారానికి తెరలేపపుతుంది. కెసియార్ అన్నకూతురును పార్టీ చేర్చుకుని కుటుం బ విభేదాలను వాడుకునేందుకు చంద్ర బాబు ప్రయత్నిస్తున్నాడని టిఆర్ ఎస్ అసత్యప్రచారం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న అనుకూల వాతావరణంలో టిఆర్ ఎస్ , టిడిపి మధ్య కొత్త సంఘర్షణ వల్ల నష్టం జరుగుతుందని అందువల్ల ఆమెను పార్టీలో చేర్చుకోకపోవడమే మంచిదని చంద్రబాబు సూచించారని టిటిడిపి నేత ఒకరు తెలుగు రాజ్యం కుచెప్పారు.