బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు.. ఆ పార్టీలు పోటీ చేస్తే మాత్రం తప్పా?

KCR National Party BRS

కేసీఆర్ పార్టీ అయిన బీఆర్ఎస్ 2024లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి అంతోఇంతో గుర్తింపు ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేయాలని భావిస్తోంది. ప్రత్యేక తెలంగాణ కోసం కష్టపడి పదేళ్ల క్రితం తెలంగాణను సాధించుకున్న కేసీఆర్ రాబోయే రోజుల్లో కేంద్రంలో సత్తా చాటాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనపడుతుండటంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

అయితే తెలంగాణ అధికార పార్టీ నేతల మాటలు మాత్రం వింతగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చని చెబుతున్న అధికార పార్టీ నేతలు ఇతర పార్టీలు తమ రాష్ట్రంలో పోటీ చేస్తాయంటే మాత్రం అంగీకరించడం లేదు. ఆంధ్రా మూలాలు ఉన్న రాజకీయ నేతలు తెలంగాణలో పోటీ చేయడం ఏంటని వినిపిస్తున్న కామెంట్లపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఆ పార్టీలు పోటీ చేస్తే మాత్రం తప్పా అని కొంతమంది నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నేతల మాటలు విచిత్రంగా ఉన్నాయని ఆ మాటలు సామాన్యులకు అర్థం కావని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలు కొన్ని విషయాలకు సంబంధించి మారాల్సి ఉంది. ఇలాగే ఉంటే మాత్రం పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలుగుతుందని చెప్పవచ్చు.

మారుతున్న పరిణామాలను గుర్తుంచుకుని బీఆర్ఎస్ అడుగులు వేస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను సామాన్య ప్రజలు సైతం గమనిస్తున్నారు. 2024లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల పోటీ మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.