బీజేపీ పగ మామూలుగా ఉండదు.. పాపం ఎమ్మెల్సీ కవిత అంటూ?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ అయినా అడుగులు వేస్తే ఆ పార్టీ అవతలి పార్టీ కీలక నేతలపై పగ తీర్చుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోదనే సంగతి తెలిసిందే. తనపై ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేయడం గురించి కవిత స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ విధంగ చేయడం బీజేపీ నీచమైన, హీనమైన చర్య అని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు.

మోదీ సర్కార్ దేశంలో అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతోందని ఆమె అన్నారు. 9 రాష్ట్రాలలో బీజేపీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని కవిత చెప్పుకొచ్చారు. 2023 డిసెంబర్ లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణకు మోడీ కంటే ముందు ఈడీ వచ్చిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసులు పెట్టడం హీనమైన ఎత్తుగడ అని కవిత అభిప్రాయపడ్డారు.

ఎలాంటి విచారణకు అయినా నేను సిద్ధమని తనపై నమోదైన కేసులకు భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదని కవిత కామెంట్లు చేశారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి ఎన్నికల్లో గెలవాలని భావించడం సరికాదని కవిత అన్నారు. జైలులో పెట్టినా భయపడమని ప్రజల సపోర్ట్ ఉన్నంత కాలం తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె కామెంట్లు చేశారు. అయితే కవిత అరెస్ట్ దిశగా అడుగులు పడుతుండటంతో బీజేపీ పగ మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఈ తరహా పరిస్థితి ఏర్పడిందని చాలామంది చెబుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ సైతం బీజేపీకి ధీటుగా కౌంటర్లు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్ విషయంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఎంతమంది అరెస్ట్ అవుతారో చూడాల్సి ఉంది.