బీఫ్ ఫెస్టివల్ వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష

BJP MLA Raja singh sentenced to one year in jail in beef festival controversy

తెలంగాణ: భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనసభ్యుడు గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు నాంపల్లి స్పెషల్ కోర్ట్ ఏడాది జైలు శిక్ష విదించింది. బీఫ్ ఫెస్టివల్ వివాదంలో రాజాసింగ్‌పై ఐదేళ్ల క్రితం బొల్లారం పోలిస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ సమయంలో ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్‌ ఫెస్టివల్‌ను రాజాసింగ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు.

BJP MLA Raja singh sentenced to one year in jail in beef festival controversy
BJP MLA Raja singh sentenced to one year in jail in beef festival controversy

2016వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్ధులు బీఫ్ ఫెస్టివల్ చేసుకొబోతున్నారనే వార్తలపై రాజా సింగ్ చాలా తీవ్రంగా స్పందించారు. బీఫ్ ఫెస్టివల్ చేసుకున్నట్లయితే నా తడాఖా చూపిస్తాను. దాద్రీ సంఘటనలు హైదరాబాద్ లో కూడా చూడవలసి వస్తుంది అని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాజా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలతో రాద్ధాంతం చేస్తూ పోలీసులను కూడా బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై సెక్షన్ 295-ఏ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది.

ఈ కేసు ఐదేళ్ల పాటు విచారణ సాగగా, శుక్రవారం నాంపల్లి కోర్టు రాజా సింగ్‌కు జైలు శిక్ష విధించింది. అనంతరం ఆయన బెయిల్‌కు దరఖాస్తు చేయగా, న్యాయస్థానం అందుకు సమ్మతిస్తూ బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తానని రాజా సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.