వికారాబాద్ లో దారుణ ఘటన జరిగింది…. కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో టీచర్ కొట్టిన దెబ్బలకు ఏడవ తరగతి చదువుతున్న బాలుడు మృతి చెందాడు.
మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన సాత్విక్ అనే బాలుడు పూడూరు మండలం చిలాపూర్ గ్రామ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 23వ తేదీన బాలుడి చేతికి గాయమైంది. అయితే స్కూల్లో యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియకుండా హాస్టల్లోనే రెండు, మూడు రోజులు ట్రీట్మెంట్ చేసింది. అయినా గాయం మానకపోవడంతో ఫిబ్రవరి 26వ తేదీన సాత్విక్ తల్లిదండ్రులకు విషయం తెలిపారు.
ఫిబ్రవరి 27వ తారీకు స్వాతిక్ తల్లిదండ్రులు బాలుడి ని ఇంటికి తీసుకెళ్లారు. గాయం తీవ్రమవడంతో వెంటనే హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం బాలుడిని తీసుకువెళ్లారు. బాలుడు గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు చేతికి సర్జరీ చేయడం అవసరమని తెలిపారు. అయితే సర్జరీ చేసిన కొద్దిసేపటికి బాలుడు మృతి చెందాడు. దీంతో కోపద్రిక్తులైన తల్లిదండ్రులు స్కూల్లో టీచర్ కొట్టడం వల్లనే తమ కుమారుడు అనారోగ్యం పాలు అయ్యాడని, ఆ గాయం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ ఆరోపణలను స్కూల్ యాజమాన్యం ఖండించింది. సాత్విక్ ను ఏ టీచర్ కొట్టలేదని హాస్టల్లోని బెడ్ మీద నుండి కింద పడటం వలన గాయం అయిందని వారు తెలుపుతున్నారు. బాలుడు శివానికి పోస్టుమార్టం అనంతరం కింద పడటం వలన అయిన గాయాల లేక ఎవరైనా కొట్టారా అనే విషయం తెలుస్తుంది.