Road Roller: వామ్మో.. ఇలాంటి దొంగతనాలు ఎక్కడ చూసి ఉండరు..ఏకంగా రోడ్డు రోలర్ ని లేపేసాడు..!

Road Roller: సాధారణంగా వస్తువులు, బైకులు, బంగారు ఆభరణాలు వంటివి దొంగతనం చేయటం చూసుంటారు. కానీ ఇలా ఏకంగా రోడ్డు రోలర్ ని దొంగతనం చేయటం ఎక్కడైనా చూశారా.. కానీ ఇలాంటి వింత ఒకటి చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన కొంతమంది దొంగలు రోడ్డు పనుల కోసం ఉన్న రోడ్డు రోలర్ ని దొంగతనం చేశారు.

వివరాలలోకి వెళితే.. వికారాబాద్ జిల్లా గుణ మడుగు తండాకు చెందిన నర్సింహా రెడ్డి అనే వ్యక్తి 5 నెలల క్రితం బ్రిడ్జి పనులు చేపట్టారు. బ్రిడ్జి పనుల నిమిత్తం రోడ్డు రోలర్ కూడా తీసుకొచ్చారు. అయితే బ్రిడ్జి కోసం బిల్లులు రాకపోవడంతో రోడ్డు రోలర్ ని అక్కడే వదిలేసి పని నిమిత్తం వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన నరసింహారెడ్డికి ఒక వింత అనుభవం ఎదురయ్యింది. ఎక్కడైనా చిన్న చిన్న వస్తువులు దొంగతనం చేయటం చూసుంటారు. కానీ ఇక్కడ వింతగా ఏకంగా రోడ్డు రోలర్ మాయమవటం నరసింహారెడ్డిని షాక్ కి గురిచేసింది.

రోడ్డు రోలర్ గురించి నరసింహారెడ్డి స్థానిక ప్రజలను విచారించగా జినుగుర్తికి చెందిన షాబోద్దిన్‌ అనే వ్యక్తి రోడ్డు రోలర్ ని లారీలో ఎక్కించుకొని వెళ్లాడని అక్కడి ప్రజలు నరసింహారెడ్డికి సమాచారం అందజేశారు. అయితే నరసింహారెడ్డి వెళ్లి షాబోద్దిన్‌ ని విచారించగా కొంతమంది వ్యక్తులు తమకు ఈ రోడ్డు రోలర్ అమ్మేశారని, అందువల్ల తాను రోడ్డు రోలర్ తీసుకు వచ్చాను అని నరసింహా రెడ్డికి సమాధానం చెప్పాడు.

కొందరు వ్యక్తులు రోడ్డు రోలర్ తనకు అమ్మగా తను కేవలం లారీని కిరాయికి తీసుకొని వెళ్ళి దానిని తీసుకొచ్చి దాని భాగాలు విడిగా చేసి పాత సామాన్లు గోడౌన్ లో ఉంచామని షాబోద్దిన్‌ చెప్పుకొచ్చాడు. పాత సామాన్లు గోడౌన్ కు వెళ్లి చూడగా అక్కడ రోడ్డు రోలర్ భాగాలు విడివిడిగా ఉండటం చూసి నరసింహారెడ్డి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ వింత చోరీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.