కన్న కొడుకు పట్ల కాలయముడైన తండ్రీ… అన్నంలో విషం కలిపి కొడుకుపై హత్యా యత్నం..!

సాధారణంగా పిల్లల పట్ల తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ అభిమానాలు ఉంటాయి. అలాగే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు వారిని మందలించి సరైన మార్గంలో వెళ్లేలా చేస్తారు. కానీ కుటుంబ పోషణ మరిచి గాలికి తిరిగే ఒక తండ్రిని కొడుకు మందలించటంతో ఆ తండ్రి దారుణానికి పాల్పడిన ఘటన ఇటీవల వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే.. వికారాబాద్ మోమిన్‌పేట మండలం ఎన్కతల గ్రామంలో ఉప్పరి పెంటయ్య, గోవిందమ్మలు దంపతులు ఇద్దరూ కుమారులతో కలిసి నివసిస్తున్నారు. పెంటయ్య ఎద్దులు, మేకల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా కుటుంబపోషణ మరచి తిరుగుతుండేవాడు. దీంతో తన కుమారుల సహాయం తో గోవిందమ్మ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.ఇటీవల భూముల ధరలు విపరీతంగా పెరగటంతో పెంటయ్య తన పంట పొలాన్ని విక్రయించడానికి ప్రయత్నం చేశాడు.

కానీ కుమారులు ఇద్దరు అతనికి అడ్డు చెప్పడంతో కుమారుల మీద కక్ష పెంచుకున్న పెంటయ్య వారు తినే భోజనంలో విషయం కలపాడు. ఈ విషయం తెలియని పెద్ద కుమారుడు భోజనం తిని అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతనిని ఆస్పత్రికి తరలించగా తిన్న ఆహారంలో విషం కలిసిందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో గోవిందమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.