టిఆర్ఎస్ సభకు పోతోళ్లకు రూ. 500, బీరు, బిర్యానీ (వీడియో)

టిఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రగతి నివేదన సభకు 25 లక్షల మంది తరలిరావాలని సీఎం కేసీఆర్ నాయకులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్ పిలుపు మేరకు అంత మంది జనసమీకరణకు నాయకులు  అష్టకష్టాలు పడుతున్నారు. అసలే ముందస్తు ఎన్నికలు వస్తాయన్న వార్తలతో ఆశావహులు వారి వారి వ్యూహాల్లో ఉన్నారు. దీంతో జనసమీకరణ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. సభకు పోతోళ్లకు బీరు బిర్యానీ మందు ఇస్తున్నారట. కింద వీడియోలో మహిళలు స్వయంగా చెప్పారు చూడండి.

జనసమీకరణ  కోసం కొంత మంది నాయకులు స్థానికంగా ఉన్నవారి దగ్గర చందాలు వసూలు చేస్తున్నారు. నాయకులు ప్రజలకు మీటింగ్ కు వచ్చినందుకు రూ.500, మందు, బీరు, బిర్యానీలు ఇస్తున్నారని సభకు వెళుతున్న ప్రజలు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజక వర్గానికి చెందిన కొంత మంది మహిళలను టిఆర్ ఎస్ నాయకులు సభకు తీసుకుపోతున్నారు. వారు ఓ చోట ఆగగా మీటింగ్ కు వెళుతున్నారు మీరు ఇష్ట పూర్వకంగానే వెళుతున్నారా అని పలువురు యువకులు ప్రశ్నించారు. దీనికి వారు సమాధానంగా మా పనులు వదులుకొని ఎందుకు పోతాం.. మనిషికి 500 రూపాయలు, బిర్యానీ, మందు ఇస్తామన్నారు. అందుకే పోతున్నామని చెప్పారు. ఆ మహిళలు స్వయంగా మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.