Bheemla Nayak: వికారాబాద్ లో సందడి చేసిన భీమ్లా నాయక్.. పవర్ స్టార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు!

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే నేడు ఉదయం సినిమా షెడ్యూల్ వికారాబాద్ లో ప్రారంభించారు. వికారాబాద్ లోని మదన్ పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది.ఈ క్రమంలోనే ఇక్కడ పవర్ స్టార్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు షూటింగ్ లోకేషన్ కు చేరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ లొకేషన్ కి రాగానే పెద్ద ఎత్తున అభిమానులు పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు.

ఈ క్రమంలోనే అభిమానులు పవన్ కళ్యాణ్ అంటూ గట్టిగా కేకలు వేయడంతో పవన్ కళ్యాణ్ కారు నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ఇకపోతే ఈ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడంతో షూటింగ్ లొకేషన్ మొత్తం సందడి సందడిగా కనిపించింది. ఇక ఈ సినిమా వచ్చే నెల సంక్రాంతికి విడుదల కానుందని చిత్ర బృందం వెల్లడించారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా డానియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఇందులో సంయుక్త మీనన్, నిత్య మీనన్ హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుని వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.