తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కే.కేశవరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలను పెద్దల సభకు పంపేందుకు నిర్ణయం జరిగిందని, అయితే ఇప్పటి వరకు దీనిపై సస్పెన్స్ మెయింటెన్ చేసిన కేసీఆర్ బుధవారం అధికారిక ప్రకటన చేయనున్నారని వినబడుతోంది.
రెంజు రాజ్యసభ సీట్లు మాత్రమే ఉండటంతో కేసీఆర్ బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. ఇక సీట్లు ఆశించిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ వంటి వారిని ఎమ్మెల్సీలను చేసి శాసనమండలికి పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా రాజ్యసభకు కవితను పంపిస్తారని పెద్ద ఎత్తువ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే.. అభ్యర్థులను ఫైనల్ చేసేప్పుడు మాత్రం కవిత పేరు ఎక్కడా వినిపించలేదు. దీంతో కవితను రాజ్యసభ రేస్ నుండి తప్పించి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తారా.. లేకుంటే మరేదైనా నామినేటెడ్ పదవి ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.