మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో మరోసారి కారు జోరు చూపించింది. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలను కార్పెరేషన్లను తన ఖాతాలో వేసుకుని గత అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలని పునరావృత్తం చేసింది. రాష్ట్రంలో చాలా మెజారిటీ జిల్లాల్లో కారు తడాకాకి ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలు సోయిలో లేకుండా పోయాయి. ఇంతవరకు కథ బాగానే ఉన్నా.. తనకు మెజార్టీ రాని చోట్ల కూడా ఛైర్మన్ పదవులను ఛేజిక్కించుకోవడానికి తెరాస నేతలు ప్రయత్నించడం విమర్శలు తావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటని చోట్ల ప్రతిపక్షాల నుంచి ఎన్నికైన కౌన్సిలర్లను తమ సిబిరాల వైపు రప్పించుకోడానికి తెరాస నేతలు నిర్మమున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో మరోసారి కారు జోరు చూపించింది. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలను కార్పెరేషన్లను తన ఖాతాలో వేసుకుని గత అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలని పునరావృత్తం చేసింది.
రాష్ట్రంలో చాలా మెజారిటీ జిల్లాల్లో కారు తడాకాకి ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలు సోయిలో లేకుండా పోయాయి. ఇంతవరకు కథ బాగానే ఉన్నా.. తనకు మెజార్టీ రాని చోట్ల కూడా ఛైర్మన్ పదవులను ఛేజిక్కించుకోవడానికి తెరాస నేతలు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. గెలిచిన ప్రతిపక్షానికి తమకు సీట్ల విషయంలో అంతరం తక్కువగా ఉన్నచోట్ల అధికార తెరాస నేతలు వాళ్ళ జులుం చూపిస్తున్నారు. దీనికి రంగారెడ్డిజిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని ఆదిభట్ల మున్సిపల్ ఫలితమే ఇందుకు నిదర్శనం. ఆదిభట్ల అనతికాలంలో అభివృద్ధ పరంగా ఎంతో దూసుకుపోతుంది. ఇక్కడ నిన్న మొన్నటివరకు చిన్న కుగ్రామంగా ఉన్న ఆదిబట్ల ఇప్పుడు అటు ఏరోనాటికల్ అటు సాఫ్ట్‌వేర్ రంగాలకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. ఈ రంగాలకు చెందిన ఉద్యోగులు ఆదిభట్ల ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పర్చుకోవడానికి ఆశక్తి ని కనబరుస్తుండడంతో అభివృద్ధి హై స్పీడ్ అందుకుంది.
దీంతో ఇక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికలను తెరాస ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే మున్సిపల్ ఎన్నికలు ఆ పార్టీ అంచనాలను తారుమారు చేశారు. ఈ రోజు వెలువడిన ఫలితాల్లో 15 వార్డుల్లో 8వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్‌కు అధికార పీఠం కైవసం చేసుకోడానికి రూట్ క్లియర్ అయింది. అయినప్పటికీ కాంగ్రెస్ చీల్చి కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోడానికి తెరాస నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఇబ్రహీం పట్నం నియోజక వర్గ కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపిస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన తమ కౌన్సిలర్లను తెరాస నేతలు అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు.